కోలీవుడ్ ప్రేక్షకులలో నయనతార హాట్ లుక్స్ కు ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఆమె గ్లామర్ ఎక్స్ పోజింగ్ తో నిర్మాతలకు కాసులు కురుస్తాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. అందువల్లనే కోలీవుడ్ యంగ్ హీరోలు అందరూ కూడ నయనతారతో నటించడానికి ఇష్టపడతారు. నయన కూడ తనకు వస్తున్న అవకాశాలను ఏమి వదలకుండా యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు వరస పెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్స్ కు షాక్ ఇచ్చే స్థాయిలో ఉంది నయనతార.

ప్రముఖ రాజకీయ వేత్త కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్ కు కోలీవుడ్ లోని యంగ్ హీరోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతడి సినిమాలు ఇప్పటి వరకు కోలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయిన సందర్భాలు లేకపోయినా ఉదయనిది స్టాలిన్ కు ఉన్న పలుకుబడితో వరస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఈ యంగ్ హీరో కూడా తన స్థాయిని దృష్టిలో పెట్టుకుని హన్సిక దగ్గర నుంచి నయనతార వరకు టాప్ హీరోయిన్స్ తో నటిస్తూ కేవలం ఆ హీరోయిన్స్ క్రేజ్ వల్ల తాను హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం విడుదలైన ఉదయనిది స్టాలిన్ ‘నాన్ బెండా’ సినిమాలోని నయనతార టాటు తో కూడిన ఎక్స్ పోజింగ్ స్టిల్ కు సంబంధించిన పోస్టర్లు తమిళనాడు రాష్ట్రం అంతా  గత రెండు రోజులుగా ప్రతిచోట కనిపిస్తూ తెగ హడావిడి చేస్తున్నాయి. కేవలం నయనతారను నమ్ముకుని తమిళనాడు రాష్ట్రంలోని 400 ధియేటర్లలో ఈసినిమా ఈరోజు విడుదలైంది అంటే నయనతార గ్లామర్ లుక్స్ కు కోలీవుడ్ ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో అర్ధం అవుతుంది .. 


మరింత సమాచారం తెలుసుకోండి: