యంగ్ టైగర్ ఎన్టీర్ ను ఒక వీరాభిమాని ఈమధ్య కలిసినప్పుడు భారీ గెడ్డంతో ఒక సన్యాసిలా భారీ గెడ్డంతో కనిపించి ఆశ్చర్య పరిచాడట. ఆ వీరాభిమాని వెంటనే జూనియర్ కొత్త లుక్ ను తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి వెబ్ మీడియాలో పెట్టి హడావిడి చేస్తున్నాడు. ఈ ఫోటోలను చూసి కొందరైతే జూనియర్ సుకుమార్ తీయబోతున్న కొత్త సినిమాలో ఈ లుక్ లో కనిపిస్తాడు అంటూ ఊహగానాలు చేస్తూ అప్పుడే వార్తలు కూడా వ్రాస్తున్నారు. 

సుకుమార్ తీస్తున్న కొత్త సినిమాలో జూనియర్ ను ఒక కొత్త హెయిర్ స్టైల్ తో చూపెట్టడానికి నిశ్చయించు కోవడంతో ముంబాయి నుంచి వచ్చిన ఒక హెయిర్ స్టైలిస్ట్ డిజైన్ చేయబోయే కొత్త లుక్ కోసం జూనియర్ ఇలా భారీగా తన గెడ్డాన్ని పెంచుకుని కొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనే ఊహగానాలు కూడ  ఉన్నాయి.

అయితే వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్న  ఈ న్యూ లుక్ ఫోటోలను చూసి జూనియర్ అభిమానులు ఖంగారు పడుతున్నట్లు టాక్. గత సంవత్సరం సుకుమార్ మితిమీరిన ప్రయోగాలతో దెబ్బ తిన్న మహేష్ ఇప్పటి వరకు కోలుకోలేని నేపధ్యంలో మళ్ళీ ఎటువంటి కొత్త ప్రయోగాలకు జూనియర్ ను సుకుమార్ బలి చేస్తాడో అన్న భయంతో బెదిరి పోతున్నారట జూనియర్ అభిమానులు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: