తమిళంలో  విజయ్ కి ఇళయదళపతి అనే పేరుంది. విజయ్ ఆరంభంలో అంతగా హిట్లు లేకపోయిన గత ఐదు సంవత్సరాల నుంచి మనోడికి ప్రతి సినిమా హిట్ మీద హీట్ తెలుగు పోకిరి సినిమా తమిళ వర్షన్ లో విజయ్ చేశాడు. ఇక్కడ ఎంత హిట్ అయ్యిందో అక్కడా అంతే హిట్ సాధించింది. ఈ మధ్య వచ్చిన కత్తి తమిళ నాడులో బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. విజయ్‌ లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ‘పులి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌గానీ, సినిమా స్టిల్స్‌గానీ ఇప్పటివరకు బయటికి రాలేదు.


పులి ఫ్యాన్స్ పోస్టర్

sddefault

ఈ చిత్ర యూనిట్‌ ఇప్పుడు తిరుపతి దగ్గరలోని తలకోన ఫారెస్టులో షూటింగ్ షర వేగంగా జరుపుకుంటుంది. ఇది చాలా దట్టమైన అడవి కావడంతో రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేదు. దీంతో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వని నిర్మాతలు యూనిట్‌ సభ్యులు షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళడం కోసం రోడ్లు, ఉడెన్‌ బ్రిడ్జ్‌లు నిర్మించారు. ఈ ఫారెస్ట్‌లో 200 మంది కార్పెంటర్స్‌, 100 మంది మౌల్డర్స్‌, 50 మంది వెల్డర్స్‌ 100 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడి భారీ విలేజ్‌ సెట్‌ని నిర్మించారు. నిజమైన విలేజ్‌ని చూస్తున్నామా అని విలేజ్‌ సెట్‌ని చూసిన యూనిట్‌ సభ్యులు ఆశ్చర్యపోయారు.  ఇక్కడ ఓ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరిస్తున్నారట  ఇందులో విజయ్‌తోపాటు శృతి హాసన్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రి తదితరులు పాల్గొంటారు. ఈ పాటను శ్రీధర్‌ మాస్టర్‌ నృత్యదర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. పాటను 5 కోట్ల 25 లక్షల రూపాయలు భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను 118 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. మరి ఇంట్ర డక్షన్ సాంగ్ ఏ రేంజ్ లో ఉందో ఆడియో వేడుకల్లో చూడాల్సిందు....


మరింత సమాచారం తెలుసుకోండి: