టాప్ కమెడియన్ అలీ ఇప్పటి వరకు వివాదాలకు దూరంగా ఉంటూ సినిమా రంగంలో అందరి వాడుగా కొనసాగుతూ వచ్చాడు. అయితే అలీకి  ప్రస్తుతం నడుస్తున్న కాలం కలిసి రావడం లేదా అనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా ఆడియో ఫంక్షన్స్ లో  అలీ వేస్తున్న మితిమీరిన జోక్స్ కు అతడి సహ యాంకర్లు అలీ పై విరుచుకు పడిన సంఘటనలు చూసాము. 

ఇది జరిగిన  కొద్ది రోజులకు నిన్న ‘మా’ ఎలక్షన్స్ ఫలితాలలో అలీ ఊహించని పరాజయం పొందాడు. జయసుధ ఓటమికి మురళీమోహన్ పైన ఉన్న వ్యతిరేకత కారణం  అన్న కామెంట్స్ వస్తే  జయసుధ ప్యానల్ అంతా గెలిచి కూడా అలీ ఓటమికి కారణం ఏమిటి అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 

అయితే అలీ పై శివాజీరాజా బహిరంగంగా చేసిన నమ్మక ద్రోహం ఆరోపణలు అలీ పరాజయాన్ని ప్రభావితం చేసాయి అని అంటున్నారు. మా ఎన్నికల వేళ 30 ఏళ్ల తమ ఫ్రెండ్‌షిప్‌కు అలీ నమ్మకద్రోహం చేసాడని శివాజీరాజా బహిరంగంగా కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ ‘మా’ సంస్థ ఓటర్ల మైండ్ లోకి చొచ్చుకు పోయింది అని టాక్. దీనితో ఈ ఎన్నికలలో శివాజీరాజా గెలుపొందగా, ఆలీ ఓటమి చవిచూశాడు. మరి వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతుందా? అనే ఆ శక్తి కుడా  చాలామందిలో ఉంది.

ఇదేవిధంగా గత ఏడాది ఏపీ శాసనసభ ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీ పోటీ చేస్తున్నాడంటూ జోరుగా వార్తలొచ్చాయి. అయితే అక్కడ కూడా  అలీకి తెలుగుదేశ అధినాయకత్వం నుండి ఎదురు దెబ్బే తగిలింది. దీనితో అలీ రాజకీయాలకు  సంబంధించి ఏ ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడంతో అలీ ప్రస్తుతం నిరాశలో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: