గత కొంత కాలంగా ‘మా’ ఎలక్షన్స్ ఏ విధమైన సంచలనాలకు తెర లేపిందో అందరికీ తెలుసు. సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా ఈ స్టంట్ నడిచింది. చివరికి కోర్టు దాకా వెళ్లింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు నాగబాబు స్పందించారు. మా అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్‌ను ఏకగ్రీవం చేయాలని అనుకున్నామని ఆయన అన్నారు తాము జయసుధకు వ్యతిరేకం కాదని, అయితే నలుగురికి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడయితే బాగుంటుందని భావించి మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు. వాస్తవానికి మొదటి నుంచి రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అందరూ సూచించినా అకస్మాత్తుగా తెరపైకి జయసుధను ఎంటర్ చేశారు. తర్వాత ఆమెను ఏ విధంగా వాడుకోవాలో అవిధంగా వాడుకున్నారు. చివరకు మా పై వ్యక్తిగత దూషనలకు దిగే స్థాయికి చేరుకున్నారు.


మా ఎలక్షన్స్ కి ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న నాగబాబు, రాజేంద్ర ప్రసాద్


మా సభ్యత్వ రుసుం తగ్గించాలని, చాలా మందికి రుసుం కారణంగా సభ్యత్వం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు ఉందని, ఎక్కువ మంది సభ్యులు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని ఆయన అన్నారు. మొదటి నుంచి దీని గురించే మేం పోరాడుతున్నాం. అందుకే రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికాం. ఎన్నికల సందర్భంగా మొదట్లో జరిగిన కొన్ని పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయని, అసలు కోర్టు వరకు వెళ్లాలన్న ఆలోచన రాలేదని నాగబాబు వివరించారు. అయితే ఇవన్నీ నటుడు ఓ.కల్యాణ్‌కు నచ్చలేనందువల్లే కోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఏదేమైనా మేమంతా ఒకే చెట్టునీడన బతికేవాళ్లం.. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండబోవు. జయసుధ అంటే మాకు ఎప్పటికైనా గౌరవమే అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: