మాస్ మహారాజ రవితేజ తాను నటించే సినిమాల దర్శక నిర్మాతలకు సమస్యలు కలిగించిన సందర్భాలు చాల అరుదు. అందువల్లనే రవితేజా పై పెద్దగ గాసిప్పులు  ఉండవు. అయితే దీనికి భిన్నంగా రవితేజా ‘కిక్ 2’ సినిమా విషయంలో తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఆ సినిమా దర్శకుడు సురేంద్రరెడ్డిని ఆశ్చర్య పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. 

కిక్ 2 మూవీ రిలీజ్ డేట్


వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్ గా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ పనులు ఇంచుమించు పూర్తి కావడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం అయ్యాయి. మే 7న విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈమధ్యనే రవితేజ చూడటం జరిగింది అని అంటున్నారు. 

రవితేజ లుక్ 


అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పేలవంగా ఉండటమే కాకుండా  కొన్ని సన్నివేశాలలో రవితేజ లుక్ ఆయనకు ఆయనకే నచ్చలేదట. దీనితో షాక్ గురైన  రవితేజ్ ఈ సన్నివేశాలను మార్చమని సురేంద్ర రెడ్డి పై ఒత్తిడి పెంచినట్లు టాక్. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ధియేటర్ మరియు మార్కెట్ ప్రాంతాలలో చిత్రీకరించారు.

‘కిక్ 2 మూవీ రీషూట్


‘రేసు గుర్రం’ తరువాత సురేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే రవితేజ  వ్యక్త పరిచిన అసంతృప్తితో మళ్ళీ ఈ సినిమాను కొన్ని సన్నివేశాలకు సంబంధించి రీషూట్ చేస్తే ఎట్టి పరిస్తుతులలోను అనుకున్న మే 7వ తేదీకి విడుదల చేయడం జరగని పని అని దర్శకుడు సురేంద్రరెడ్డి నిర్మాత కళ్యాణ్ రామ్ భయపడుతున్నారని టాక్. అయితే తన సినిమాల అవుట్ పుట్ గురించి పెద్దగ ఎప్పుడూ పట్టించుకోని రవితేజ ఈసారి తన ‘కిక్ 2’ విషయంలో ఇంత లోతుగా రంద్రాన్వేషణ చేయడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది..   
 


మరింత సమాచారం తెలుసుకోండి: