తమిళనాట మకుఠం లేని మహారాజుల్లా వెలిగి పోతున్న హీరోలు మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది రజినీకాంత్, కమల్ హాసన్.  వీళ్లు మొదట్లో కొన్ని సినిమాలో నెగిటీవ్ షేడ్స్ లో ఉన్నవి వేసినా కొత్తలో ఒకే సినిమాలో జంటగా నటించినా తర్వాత కాలంలో ఎవరి ఇమేజ్ వారికి వచ్చిన తర్వాత  ఎన్నో సార్లు వీరిద్దరిని కలిపి సినిమా తీయాలను పలువురు దర్శక నిర్మాతలు విఫలయత్నం చేశారు. ఇన్నేళ్ల తర్వాత వారు కలిసి నటించే అవకాశం కనిపిస్తోందనే వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఇటీవల లింగ సినిమాతో పడరాని పాట్లు పడిన రజనీకాంత్, తనకు కమర్షియల్ సినిమా చేసిపెట్టమని దర్శకుడు శంకర్‌ని అడిగారట.


సినిమా ఆది గురువు కే.బాలచంద్రన్ తో కమల్ హాసన్, రజినీకాంత్


శకంర్ దర్శకత్వంలో  ఇప్పటికే రజినీకాంత్ రెండు సినిమాల్లో నటించాడు.  శంకర్ రజినీకాంత్ కు  కథ వినిపించాడట. అందులో హీరో పాత్రకి సరితూగే విలన్ పాత్ర ఉంది. ఆ విలన్ పాత్రని కమల్ తో చేయిస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో కమల్‌ని సంప్రదించారట. ఆయన కూడా ఓకే అన్నాడని సమాచారం. మరి వీరి సన్నాహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: