యంగ్ హీరోలు రొమాంటిక్ సీన్స్ లో నటిస్తూ తమ హీరోయిన్స్ తో లిప్ లాక్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే తొడలు కొడుతూ పంచ్ డై లాగ్స్ విసిరే బాలకృష్ణ లిప్ లాక్ సీన్ లో నటించాడు అంటే కొంచం ఆశ్చర్యకరమైన విషయమే. కాని ఈ విషయం నిజం అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. 


లయన్ మూవీ రిలీజ్ డేట్


ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మే 1వ తారీఖున విడుదల కాబోతున్న బాలకృష్ణ ‘లయన్’ సినిమాలో బాలయ్యా త్రిషల మధ్య ఒక రొమాంటిక్ లిప్ లాక్ సీన్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన సినిమాల స్పీడ్ తో కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్న బాలకృష్ణను ఒక రొమాంటిక్ హీరోగా కూడా చూపెట్టడానికి దర్శకుడు సత్యదేవ ఈ ప్రయోగం చేసాడని టాక్. 

బాలయ్య హాట్ న్యూస్


అయితే ఇటువంటి సీన్స్ బాలయ్య అభిమానులకు జోష్ కలిగించినా సామాన్య ప్రేక్షకులు ఇటువంటి సీన్స్ లో బాలయ్య నటిస్తే ఎంత వరకు హర్షిస్తారు అన్నదే ప్రశ్న. అయితే ఈ సినిమా క్రేజ్ పెంచడానికి ఇటువంటి రూమర్స్ ను బయటకు వదిలారు కాని సినిమాలో అటువంటి సన్నివేశాలు పెట్టే సాహసం ఈ సినిమా  దర్శకుడు చేయడు అనే వార్తలు కూడ ఉన్నాయి. 

బాలయ్య 100వ టైటిల్ రిజిస్టర్


ఈ వార్తలు ఇలా ఉండగా బాలకృష్ణ వచ్చే సంవత్సరం నటించబోయే 100వ సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది అంటూ వెబ్ మీడియాలో తీవ్ర హడావిడి జరుగుతోంది. ‘చరిత్రకొక్కడు’ అన్న టైటిల్ ను బాలయ్యతో ‘లెజెండ్’ సినిమాను తీసిన కొర్రపాటి సాయి ఫిలించాంబర్ లో రిజిస్టర్ చేసాడు అని టాక్. ఈ టైటిల్ కూడా చాల పవర్ ఫుల్ గా ఉండటంతో బాలయ్య అభిమానుల సందడి వెబ్ మీడియాలో కనిపిస్తోంది. దీనికి తోడు ఈ లిప్ లాక్ సీన్ వార్తలు కూడా నిజమే అయితే ఇక బాలయ్య అభిమానులకు పండుగే అనికోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: