నిన్న సాయంత్రం బుల్లితెర సాక్షిగా అలీ వదిలిన సవాల్ అందరికీ షాక్ ఇచ్చింది.  ఇప్పటి వరకు బూతు సెటైర్లు వేసే అలీ  ఈ స్థాయిలో మాట్లాడగలడా అని అనిపించేడట్లుగా చేసింది.  ప్రముఖ ఛానల్  ప్రసారం చేసిన ‘అలీవుడ్ స్పెషల్’ కార్యక్రమంలో అలీ ఈ సవాల్  విసిరాడు. ఈమధ్య తన పై వస్తున్న గాసిప్పులకు ఘాటైన సమాధానాలు ఈ కార్యక్రమంలో ఇచ్చాడు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రెజంటర్ ఈమధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో విడుదల కార్యక్రమంలో యాంకర్ సుమ అలీకి వార్నింగ్ ఇచ్చింది అంటూ వచ్చిన వార్తలను అలీ దృష్టికి తీసుకు వచ్చి ప్రశ్నించినప్పుడు ఆ  వార్తలన్నీ గాలి వార్తలు అంటూ  సునాయాసంగా తీసిపడేసి ‘అలీకి వార్నింగ్ ఇవ్వగల  వ్యక్తి  టాలీవుడ్ లో ఇంతవరకు ఎవ్వరూ పుట్టలేదు’ అంటూ నవ్వుతూ షాకింగ్ కామెంట్స్  చేసాడు అలీ.

ఇదే  విషయం పై  మరింత వివరణ ఇస్తూ యాంకర్ సుమ తన కొడుకు పుట్టినరోజు కాబట్టి తాను తొందరగా వెళ్ళిపోతాను అని తనతో చెపుతూ స్టేజ్ వెనుకకు తనను రప్పించి మాట్లాడితే సుమ తనకు వార్నింగ్ ఇచ్చింది అంటూ వార్తలు పుట్టిoచారని కామెంట్స్ చేసాడు అలీ. సుమ తనకు ఒక సోదరి వంటిది అనీ చెప్పుకొచ్చాడు. 

పబ్లిక్ ఫంక్షన్స్ లో ముఖ్యంగా ఆడియో  ఫంక్షన్స్ లో జనాన్ని నవ్వించడానికి తమకు గత్యంతరం లేక  ఇలా బూతు సెటైర్లు వేయవలసి వస్తోందని అసలు విషయం చెప్పుకొచ్చాడు అలీ. ఇప్పటి వరకు తాను 1000 సినిమాలలో తాను నటించినా తనకు రికార్డుల  పై  అవార్డుల పై చాలామందిలా మోజు లేదని కామెంట్స్ చేసాడు అలీ. తన సంపాదననుండి ప్రతినెల 40 మంది వృద్ధులకు నెలకు  500 లు  చొప్పున  పెంక్షన్ లా సహాయం అందిస్తున్నానని తనలోని సేవా గుణాన్ని తెలియచేసాడు. తాము ఏమి  మాట్లాడిన అది జనాన్ని నవ్వించడం కోసం పడేపాట్లు మాత్రమే అంటూ దానికి విపరీతార్ధాలు  తీయవద్దని మీడియా  పై సెటైర్లు వేసాడు అలీ.. 





మరింత సమాచారం తెలుసుకోండి: