ప్రముఖ సంగీత దర్శకుడు  కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ సినిమా రంగాన్ని షేక్ చేసిన చక్రవర్తి కుమారుడు సంగీత దర్శకుడు శ్రీ (కొమ్మినేని  శ్రీనివాస  చక్రవర్తి) నిన్న  సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో పోరాడి తుది శ్వాస విడిచి ‘ఈ జగమంత కుటుంబం నుండి ఎకాకాకి’ గా  సుదూర  తీరాలకు వెళ్ళి పోయాడు. 


చక్రవర్తి కుమారుడు


అయితే చక్రవర్తి కుమారుడు గానే  కాకుండా సంగీత దర్శకుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న ఇతడి మరణం వెనుక జీవితంలో  జరిగిన సంఘటనలు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కర్ణాటకా మణిపాల్ లోని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో ఉన్నత  చదువులు చదివిన శ్రీ చిన్నప్పటి నుంచి సంగీతం  అంటే  ప్రాణం.  కాని తన కోడుకును సినిమా రంగానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో  సినిమా సంగీతానికి చాల దూరంగా శ్రీని ఉంచాడు చక్రవర్తి. తన తండ్రి చక్రవర్తి ఇష్టానికి వ్యతిరేకంగా తను ప్రేమించిన అరుణను పెళ్ళి చేసుకుని తన తండ్రికి దూరం అయ్యాడు శ్రీ. 

గాయం’ సినిమాలో శ్రీ రీ రికార్డింగ్ ను విని రెహమాన్ ముగ్ధుడైపోయాడు


అయితే ఆ తరువాత చక్రవర్తి పెద్ద కుమారుడు చనిపోవడంతో తన తండ్రి వద్దకు వచ్చిన శ్రీ మళ్ళీ తన తండ్రికి దగ్గరయ్యాడు. అంతేకాదు తన తండ్రి మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కేవలం రోజుకు 50 రూపాయలు తీసుకుంటూ పనిచేసాడు అంటే సంగీతo పట్ల శ్రీకి ఎంత పిచ్చి ఇష్టమో అర్ధం అవుతుంది. తొలిసారిగా బాలకృష్ణ నటించిన ‘లారీ డ్రైవర్’ సినిమాకు రీ రికార్డింగ్ చేసి తన తండ్రి చక్రవర్తిని ఆశ్చర్య పరిచాడట శ్రీ. అయినా చక్రవర్తి తన కొడుకు సంగీత దర్శకుడిగా సెటిల్ కావడానికి అంగీకరించలేదట. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీ ‘పోలీస్ బ్రదర్స్’, ‘గాయం’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ‘గాయం’ సినిమాలో శ్రీ రీ రికార్డింగ్ ను విని రెహమాన్ ముగ్ధుడైపోయాడు అంటే శ్రీ రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది. 

శ్రీ మరణం వెనుక


ఆ తరువాత ‘మనీమనీ’ సినిమాకు ‘అనగనగా ఒకరోజు’ సినిమాకు రామ్ గోపాల్ వర్మ మెచ్చుకునే స్థాయిలో ట్యూన్స్ చేసాడు శ్రీ. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని కృష్ణవంశీ చుట్టూ తిరిగి ‘సింధూరం’ సినిమాకు ఆతరువాత ‘అమ్మోరు’ సినిమాకు సంగీతదర్శకుడుగా వ్యవహరించాడు శ్రీ. 1998 లో తన తల్లి మరణించిన తరువాత శ్రీ ఆరు నెలలు భోజనం మానేసాడు అంటే అతని సున్నిత మనస్తత్వం అర్ధమవుతుంది. తన తల్లి మరణం తరువాత నిరాశలోకి వెళ్ళిపోయిన శ్రీ మానసిక ప్రవర్తనను చూసి చాలామంది డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దానితో శ్రీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆతరువాత చక్రీ సంగీత దర్శకత్వం వహించిన ‘చక్రం’ సినిమాలో ‘జగమంత కుటుంబం నాది’ అన్న పాట తాను పాడి మళ్ళీ పేరు సంపాదించినా అవకాశాలు మాత్రం రాలేదు శ్రీకి. అదే అసంతృప్తి తో ఏకాకిగా అందరి నుండి వెళ్ళిపోయిన శ్రీ మరణం వెనుక ఎన్నోకోణాలకు సమాధానం లేని ప్రశ్నలు..
 






మరింత సమాచారం తెలుసుకోండి: