అమలాపాల్ ప్రిన్స్ మహేశ్ తో పోటీ పడుతోంది. ఏంటీ.. అమలాపాల్ కు పోటీ ఇవ్వడమేంటీ అనుకుంటున్నారా..? ఔను మరి.. ఆ కేరళ అమ్మడు మహేశ్ కు పోటీ ఇచ్చేందుకు అంత దూరం నుంచి వచ్చింది. వీరిద్దరూ ఎలా పోటీపడతారబ్బా.. వీళ్ల కాంబినేషన్లో సినిమా ఏదీ లేదే.. కొత్తదేమైనా తీస్తున్నారా అని ఆలోచిస్తున్నారా.? 

మీరు అంత దూరం వెళ్లక్కర్లేదు. ఆమె పోటీపడుతోంది సినిమాల్లో నటనలో కాదు.. పబ్లిసిటీ క్లియేషన్లోనూ.. యాడ్ ల్లోనూ.. ఔను మరి.. శనివారం ఈ కేరళ ముద్దుగుమ్మ మహేశ్ ప్రచారం చేస్తున్న ప్రముఖ నగల దుకాణం జోస్ ఆలుక్కాస్ కోసం అమలాపాల్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తోంది. 

ఈ సంస్థ గుంటూరులో ఏర్పాటు చేసిన కొత్త షోరూమ్‌ ను అమలాపాల్ ప్రారంభించేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించింది ఒకటీ రెండు సినిమాలే అయినా.. అమలాపాల్ ను చూసేందుకు జనం విపరీతంగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేయడం పోలీసులకు చాలా కష్టమైంది.  

అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమలాపాల్ కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదేమో.. కాస్త ఓవర్ గానే రియాక్టయ్యింది. జనాన్నుద్దేశించి.. ఐ లవ్యూ అంటూ పెద్దగా కేకేసింది. జనం కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ ఇచ్చారు. అంతే మరోసారి హాయ్.. లవ్.. యూ.. ఆల్ అని మరోసారి కేకేసింది. ఈ అమ్మడు ఇలా రెచ్చిపోతే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమని భావించిన పోలీసులు.. మెల్లగా ఆమెను షాపులోకి పంపించేశారు. ఏదో వచ్చాం కదా.. అని రొటీన్ రిబ్బన్ కట్ చేసి వెళ్లకుండా ఆప్యాయంగా రియాక్టైన తీరు చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: