వివాదాలు లేకుండా కమలహాసన్ నటించిన సినిమాలు కాని అతడి వ్యక్తిగత జీవితం కాని ఉండదు. వివాహ వ్యవస్థ నుండి సహజీవనం వరకు అనేక సార్లు సంచలన వ్యాఖ్యలు చేయడం కమలహాసన్ కు పరిపాటి. తన పై అదేవిధంగా తాను నటించిన సినిమాల పై ఎన్ని వవాదాలు వస్తే అంత పబ్లిసిటీ అనుకుంటాడు కమలహాసన్. ఈ విలక్షణ నటుడు కొద్దిరోజుల క్రితం ఒక జాతీయ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాహ్మణుల  సామాజిక వర్గం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెర లేపాయి. 


కమల్ కామెంట్స్ 


మహారాష్ట్ర ప్రభుత్వం ఆవు మాంసం తినడం పై విధించిన నిషేధం పై స్పందిస్తూ ఆవునే కాకుండా ఏ జంతువును కూడా చంపి తనడం మంచిది కాదని అంటూ శ్రీమహావిష్ణువు మత్య్సావతారము ఎత్తాడు కాబట్టి చేపలలో కూడా  దేవుడున్నాడని అందువల్ల వాటిని కూడ చంపి తినకూడదు అంటూ కామెంట్స్ చేసాడు కమల్. అయితే మాంసం తినడం అన్నది వారివారి వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిoది అని అంటూ మాంసం తినడం వల్ల పాప పుణ్యాలు కలుగుతాయి అని తాను భావించడం లేదని కామెంట్స్ చేసాడు కమల్.


కమల్ ‘ఉత్తమవిలన్’ సినిమాను బహిష్కరించమని పిలుపు


ఇదే సందర్భంలో మరొక అడుగు ముందుకు వేసి కమల్ పురాతన గ్రంధాలలో బ్రాహ్మణులు ఆవు మాంసం తినేవారు అని చెప్పే ఉదాహరణలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేసాడు కమల్. అయితే ఈ కామెంట్స్ తమిళనాడులోని బ్రాహ్మణుల వరకు చేరడంతో ఆ సామాజిక వర్గం వారు కమలహాసన్ పై తీవ్ర కోపంతో టార్గెట్ చేస్తూ  కమల్ ‘ఉత్తమవిలన్’ సినిమాను బహిష్కరించమని పిలుపు ఇచ్చినట్లుగా వార్తలు వస్త్తున్నాయి.


అంతేకాదు  కమల్ ఈ విషయం పై బ్రాహ్మణుల కు బహిరంగ క్షమార్పణ చెప్పకపోతే కమల్ పై కోర్టు కేసులు వేయడమే కాకుండా ‘ఉత్తమవిలన్’ సినిమాకు సమస్యలు  సృష్టిస్తామని హెచ్చరికలు జారి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఏ విషయానికి భయపడని కమలహాసన్ ఈ విషయం పై స్పందిస్తాడా అన్నది చూద్దాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: