పవన్ ఏది చేసినా ఎలా ఉన్నా సంచలనమే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కలిగిన పవన్ కళ్యాణ్ తన లుక్ పరంగా ఎవ్వరికీ అర్ధం కాని అతి నిరాడంబారత ప్రదర్శిస్తూ తాము చూస్తున్న రూపం పవన్ కళ్యాణ్ కి సంబంధించిందేనా అనే అనుమానం వచ్చే స్థితిలో పవన్ ఒక యోగిలా మారిపోతున్నాడు అంటూ అభిమానులు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. 

తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవన్ కళ్యాణ్ ఓదార్పుతో మరియు సహాయంతో డాక్టర్లు ఆశ్చర్యపడేలా కోలుకున్న శ్రీజ తన తల్లితండ్రులతో కలిసి నిన్న పవన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుటుంబంతో పవన్ కళ్యాణ్ రెండు గంటలు గడిపిన సంఘటనకు సంబంధించి మీడియా ద్వారా బయటకు వచ్చిన వీడియోలో పవన్  లేటెస్ట్ రూపాన్ని చూసి అభిమానులు విపరీతంగా షాక్ అయ్యారు అని టాక్. విపరీతంగా పెరిగిన గెడ్డంతో అత్యంత సాదాసీదాగా కనిపించిన పవన్ లుక్ దేనికి సంకేతం అంటూ  అప్పుడే చర్చలు కూడా మొదలు అయ్యాయి. 

ఈ మధ్య కాలంలో పవన్ కు సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో పవన్ ఇలా మారిపోయాడా? లేదంటే వచ్చే నెల మొదలుకాబోతున్న పవన్ ‘గబ్బర్ సింగ్2’ లో ఇలా కనిపిస్తాడా? అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పై సెటైర్లతో ‘గబ్బర్ సింగ్ 2’ డైలాగ్స్ ఉంటాయి అన్న వార్తలు కూడా వస్తున్న నేపధ్యంలో ఆ సినిమా పాత్ర స్వభావ రీత్యా పవన్ ఇలా భారీ గెడ్డాన్ని పెంచేస్తున్నాడు అనే అనుమానాలు  కూడా ఉన్నాయి. 

ఇక పవన్ వ్యతిరేక వర్గం అయితే మరో అడుగు ముందుకు వేసి పవన్‌ వాలకం చూస్తే సినిమాలు మానేసి పూర్తిగా రిలాక్స్‌డ్‌ మూడ్‌ లోకి వెళ్ళిపోయాడు అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అంతేకాదు పవన్ పెంచుకున్న గెడ్డానికి రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’ సినిమాకి లింక్ ఉందా అంటూ జోక్స్ పేలుస్తూ పవన్ అందరికీ షాక్ ఇస్తూ ‘బాహుబలి’ సినిమాలో గెస్ట్ పాత్రను పోషిస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్ వీరాభిమానులు మాత్రం తమ అభిమాన హీరో తన లుక్ విషయం పై కూడ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది అంటూ బెంగ పడుతున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా తన అభిమానులకోసం రూపం పై పవన్ శ్రద్ద పెడితే బాగుంటుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: