మరో పది రోజులలో విడుదలకాబోతున్న బాలకృష్ణ ‘లయన్’ మార్కెట్ కు సంబంధించి  బయటకు వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈవార్తలు బాలయ్యకు కూడ షాక్ ఇచ్చినట్లు టాక్. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పాజిటివ్ ప్రీ  రిలీజ్ టాక్ ఇప్పటికే వచ్చినా ఆ టాక్ బయ్యర్లను ప్రభావితం చేయడంలేదు అన్న వార్తలు  వస్తున్నాయి. 

ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నిర్మాత ఈ సినిమా పై 45 కోట్ల బిజినెస్ చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నా ‘లయన్’ సినిమాకు  బయ్యర్ల నుండి వస్తున్న స్పందన 35 కోట్లను మించి ఉండక పోవడం ఈ సినిమా దర్శక నిర్మాతలను ఆశ్చర్య పరుస్తోంది అని టాక్.  దీనికి కారణo ఈమధ్యనే విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అని అంటున్నారు. 

ఈసినిమాకు త్రివిక్రమ్ బన్నీల క్రేజ్  కలిసినా మరియు మరే పెద్ద సినిమా పోటీగా రాకపోయినా భారీ మొత్తాలతో సత్యమూర్తిని కొనుక్కున్న బయ్యర్లు చాలా ప్రాంతాలలో ఎంతో కొంత నష్ట పోతున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తల ప్రభావం ‘లయన్’ మార్కెట్ పై పడి  బాలయ్య సినిమాకు 35 కోట్ల మించి బిజినెస్ స్టామినా లేదు అనే నిర్ణయానికి బయ్యర్లు వచ్చినట్లు టాక్. దీనితో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చుపెట్టి ఈసినిమాను నిర్మించిన నిర్మాతలు షాక్ అయ్యారు అని అంటున్నారు. 

ఈసినిమా విడుదలకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈ సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాకపోవడంతో దీని ప్రభావం ఈ సినిమా ప్రమోషన్ పై ఉన్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాలో జూనియర్ ను టార్గెట్  చేస్తూ బాలయ్య చాల  పంచ్ డైలాగ్స్ వదిలాడు అన్న వార్తలు మరింత వేడిని పెంచుతున్నాయి..  






మరింత సమాచారం తెలుసుకోండి: