బాహుబలి.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. బాహుబలి టీమ్ కూడా పక్కా ప్రచారంతో సినిమాకు హైప్ తీసుకువస్తోంది. సినిమా విశేషాలను వన్ బై వన్ రిలీజ్ చేస్తూ సినిమాపై అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్నారు. 

లేటెస్టుగా ఈ సినిమాలో తన లుక్ కు సంబంధించి రానా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఉండే అంచనాలకు తగ్గట్టుగానే రానా గెటప్ ఈ పోస్టర్ లో అదిరిపోయింది. భల్లాల దేవ పాత్ర పోషిస్తున్న రానా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గద పట్టుకుని భీకరంగా కనిపిస్తున్నారు. 

రానా ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విలన్ ఎంత భయంకరంగా ఉంటేనే.. హీరో అంతగా ఎలివేట్ అవుతాడన్నది బేసిక్ సినిమా పాయింట్. రాజమౌళికి ఈ విషయం మహా బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాల్లో విలన్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు.
 
రానా సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టర్ కు అప్పుడే బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. గెటప్ అదిరిందంటూ కామెంట్లు వస్తున్నాయి. హీరోయిన్ సమంతా.. రానా దగ్గుబాటి.. వావ్.. అని తన స్పందన పోస్ట్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: