సినిమా హీరోల పారితోషకాలంటే అవి ఆకాశాన్ని అంటుతుంటాయి. మా వల్లే సినిమాలు ఆడతాయి కాబట్టి.. ఆ మాత్రం తీసుకోవడం ఏమాత్రం తప్పుకాదని హీరోలు వాదిస్తుంటారు. సినిమా ఆడితే ఓకే.. కానీ.. పొరపాటున సినిమా ఫ్లాపైతే.. 

అందుకే తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని కొందరు విశ్లేషిస్తున్నారు. హీరో- హీరోయిన్- దర్శకుడు.. వీళ్లు ముగ్గురే సినిమా బడ్జెట్ ను అమాంతం పెంచేస్తున్నారని ఓ టాక్. అందువల్లే.. సినిమా ఎంత బాగా ఆడినా నిర్మాతకు లాభాలు రావడం లేదని.. బయ్యరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటున్నారు. 

ఐతే.. సినిమా విడుదలకు ముందే.. ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటే.. విడుదలకు కనాకష్టమైపోతే.. హీరోలు ఆదుకుంటున్నారా.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎవరి సంగతి ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పారితోషకం తగ్గించుకుని మరీ నిర్మాతలకు సాయం చేస్తున్నాడట. 

సినీరంగంపై వరుస కథనాలు ప్రచురిస్తున్న ఓ పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది. రభస విషయంలోనూ జూనియర్ అలాగే చేశాడట. జూనియర్ చాలా సినిమాలకు పెద్ద మొత్తంలో కమిట్ అయ్యి.. ఆ తర్వాత రేటు తగ్గించుకుని నిర్మాతలకు హెల్ప్ చేస్తున్నాడని ఆ పత్రిక రాసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: