మంచి కరాటే ఫోజ్ ఇచ్చి స్టయిల్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నారా.. ప్రస్తుతం తెలుగు, తమిళ,మళియాల భాషల్లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సుందరి సమంత. ప్రస్తుతానికి తెలుగులో అమ్మడికి అంత చాన్సులు లేవు కానీ తమిళ్ లో బాగానేదూసుకు పోతుంది. మరి ఈ అమ్మడు చిన్నప్పుడు కరాటే ఫోజ్ ఇచ్చి ఇలా ఫోటో దిగింది.


హాట్ బ్యూటీ సమంత


సమంత   కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు 2011, ఈగ 2012, ఎటో వెళ్ళిపోయింది మనసు 2012, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013, అత్తారింటికి దారేది 2013 చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: