సినిమా ఇండస్ట్రీ అంటేనే పాత నీరు పోయి కొత్త నీరు రావడం అంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలాంటి పరిణామాలు తొందరగా జరుగుతుంటాయి. అందుకే హీరోయిన్లు కాస్త పాపులారిటీ రాగానే అందినంత సంపాదించుకోవాలనే దృష్టిలో ఉన్నారు. అంతే కాదు సీనియర్ జూనియర్ అని తేడా కూడా లేకుండా పోయింది కొంత మంది హీరోయన్లకు. ఈ మద్య వెండితెరపై తన అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ రకూల్ ప్రితి సింగ్. అమ్మడు మోడలింగ్ నుంచి వచ్చింది కాబట్టి అందాలు ఆరబోయటం అంత పెద్ద విషయం కాదు అంటుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తుండటం తో కాస్త కళ్ళు నెత్తికెక్కిన ఈ భామ సమంత పై సెటైర్ బాగానే వేసింది . 


రకూల్ ప్రితీ సింగ్ హాట్ ఫోటో


ఈ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో  తనకంటే సీనియర్ నటి అయిన సమంతపై సెటైర్ వేసింది. సమంత ఓపెనింగ్స్ కు అయితే భలే పనికి వస్తుంది. అందంగా రిబ్బన్ కటింగ్ చేస్తుంది. అందుకే ఆమెను ఎక్కువ ఓపెనింగ్స్ కి పిలుస్తారు అంటూ సెటైర్ వేసింది. వాస్తవానికి  రకుల్ కు వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తుండగా సమంత కు మాత్రం వరుసగా రకరకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చాన్స్ వస్తుండటం తో కాబోలు ఈ వ్యాఖ్యలు చేసి పొగ రాజేసింది .   


మరింత సమాచారం తెలుసుకోండి: