సినీరంగంలో విజయం చుట్టూనే అంతా తిరుగుతుంటారన్నది ఓపెన్ సీక్రెట్. శ్రుతిహాసన్ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో అంతా ఐరన్ లెగ్ అని ఈ అమ్మడిని దూరం పెట్టారు. మొదట్లో ఆమె చేసిన సినిమాల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి.. 

ముగ్ద మనోహర రూపం..




గబ్బర్ సింగ్ విజయంతో ఆమె తలరాత మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు తమిళం, తెలుగు, భాషల్లోనూ టాప్ హీరోయిన్ గా మారింది. ఐతే.. హిందీలో సక్సస్ అయితే అందులో ఉండే మజాయే వేరు. ఇప్పుడు శ్రుతిహాసన్ కు బాలీవుడ్ లోనూ బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. 

వరుస అవకాశాలు



ప్రస్తుతం శ్రుతి మహేష్‌ బాబుతో 'శ్రీమంతుడు', విజయ్ తో 'పులి', అక్షర్‌ కుమార్‌తో 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' చిత్రాలలో చేస్తోంది. లేటెస్టుగా బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన నటించే ఛాన్స్ కూడా ఈ సుందరిని వెదుక్కుంటూ వచ్చేసింది. తమిళ దర్శకుడు మురుగదాస్‌ ప్రస్తుతం హిందీలో 'అకీరా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

బంపర్ ఆఫర్ 



అకీరా తర్వాత మురగదాస్ హృతిక్ తో మరో సినిమా చేయాలని డిసైడయ్యాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ను అడిగారట. హృతిక్ తో ఆఫర్ అంటే మామూలు విషయమా.. అందుకే ముందూ వెనుకా ఆలోచించకుండా శ్రుతి ఓకే చెప్పేసింది. అదృష్టం డోర్ తోసుకుంటూ రావడమంటే ఇదేనేమో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: