‘మా’ సంస్థ అధ్యకుడిగా ఎన్నిక అయి ఒక వారంరోజులు కూడ గడవకుండానే  రాజేంద్రప్రసాద్ వ్యహరిస్తున్న తీరుపై నందమూరి అభిమానులు ఆగ్రహంగా  ఉన్నట్లుగా వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  తాను ఎప్పుడు ప్రసంగించినా నిమ్మకూరులోని ఎన్టీఆర్ ఇంట్లో పుట్టా ఆయన చలవ వల్లే సినిమా రంగానికి వచ్చా అని చెప్పుకునే రాజేంద్రప్రసాద్ బాలకృష్ణను కాని అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కాని కలవకుండా ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవడం నందమూరి అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించిందని టాక్. 


కెసిఆర్ ను కలిసిన రాజేంద్రప్రసాద్


ఈ వార్తలు ఇలా ఉండగా  నిన్న కెసిఆర్ ను కలిసిన రాజేంద్రప్రసాద్ త్వరలో నిర్మించనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  భవనానికి కావలసిన స్థలం విషయమై  కెసిఆర్ సహాయం కోరినట్లు టాక్. ఈ సమావేశం కేవలం మర్యాద పూర్వకంగా జరిగింది అనే వార్తలు వస్తున్నా  విశ్వసనీయంగా  తెలుస్తున్న  సమాచారం మేరకు హైదరాబాద్‌లోని కొంతమంది సినీ పెద్దల భూ తగాదాలు కూడా వీళ్ల మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. 


పద్మాలయా స్టూడియో


ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి, నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న నాగార్జున ఎన్‌కన్వెన్షన్ సెంటర్, పద్మాలయా స్టూడియో వివాదాల్ని పరిష్కరించడంలో ‘మా’ సంస్థ అధ్యక్షుడి హోదాలో రాజేంద్రప్రసాద్ సహకారం అవసరమని కెసిఆర్ కోరినట్లు  టాక్.  అయితే బయటకు వస్తున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఆదివారంనాడు ప్రమాణస్వీకారం  చేసి వెనువెంటనే సోమవారం రాజేంద్రప్రసాద్ కెసిఆర్ ను కలవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్  గా మారింది. 


అయితే రాజేంద్రప్రసాద్ తన ఊహించని గెలుపు జోష్  లో ఇంకా ఓడిన ప్యానల్ సభ్యులపై బహిరంగంగానే సెటైర్స్ వేస్తున్నాడని టాక్ వస్తోంది. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారాలను హుందాగా రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తే బాగుంటుంది అని విశ్లేషకుల భావన.. 

మరింత సమాచారం తెలుసుకోండి: