సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఎప్పుడూ ఎదుర్కొని వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. ఎన్నడూ లేని విధంగా గతసంవత్సరం రజినీకాంత్ తాను నటించిన 2 సినిమాలను విడుదల చేసినా ఆ సినిమాలు తన అభిమానుల అంచనాలను అందుకోలేక పోవడంతో డీలా పడ్డాడు. అయితే తన సత్తాని తిరిగి చాటడానికి మరో సూపర్ హిట్ సినిమాలో నటించాలి అని నిర్ణయం తీసుకున్న రజినీకాంత్ తనకు తెలిసిన దర్శకులు చెపుతున్న కథల పై మనసు పెట్టాడు. 


‘రోబో 2’ సీక్వెల్ కథ రజినీకి నచ్చడంతో


అయితే ఇదే పరిస్థుతులలో తన ‘ఐ’ మిగిల్చిన చేదు అనుభవంతో మంచి కసి మీద ఉన్న శంకర్ చెప్పిన ‘రోబో 2’ సీక్వెల్ కథ రజినీకి నచ్చడంతో ఈ సినిమాకు పచ్చ జెండా ఊపాడు అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముంబాయిలోని ఒక స్టార్ హోటల్ లో రజినీ శంకర్ ల మధ్య జరుగుతున్నాయని తెలుస్తోంది. 


ఈ సీక్వెల్ సినిమాకు విలన్ పాత్ర చాల కీలకం కావడంతో ఈ పాత్రను ఒక పేరు మోసిన ప్రముఖ నటుడి చేత నటింప చేస్తే  కాని ఈ ‘రోబో 2’ సీక్వెల్ కు క్రేజ్ ఏర్పడదు అనేది  శంకర్ భావన. ఈ ఆలోచనలతోనే శంకర్ ఈ పాత్ర కోసం అమీర్ ఖాన్ ను అడిగినా అతడు ఒప్పుకోకపోవడంతో తనకు కమలహాసన్ తో ఉన్న సాన్నిహిత్యంతో ఈ సీక్వెల్ కు సంబంధించి నెగిటివ్ పాత్ర విషయాన్ని కమల్ వద్ద శంకర్ ప్రస్తావించగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈసినిమాను చేస్తాను అని మాట  ఇచ్చాడు అని టాక్. 


రజినీ కమల్ ల కాంబినేషన్


అంతేకాదు తనకు ఎప్పటి నుంచో రజినీకాంత్ తో కలిసి నటించాలి అన్న కోరిక ఈ విధంగా దేవుడు  తీర్చాడు అంటూ కామెంట్ చేసాడట కమలహసన్. గతంలో రజినీ కమల్ ల కాంబినేషన్ లో 16 సినిమాలు వచ్చినా తిరిగి చాల కాలం తరువాత వీరిద్దరి కలయికతో సినిమా రావడం అది కోలీవుడ్ లోనే కాదు  టాలీవుడ్  లో కూడా  సంచలన వార్తే..   

మరింత సమాచారం తెలుసుకోండి: