మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కి మిక్స్‌డ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. అయితే అనుకున్నంత రేంజ్ లో సినిమా రాకపోవడానికి కారణాలు ఏంటా అంటే త్రివిక్ర‌మ్ స్టైల్ లోపించింద‌ని, ఈసినిమాలో విష‌యం ఏం లేద‌ని... మెగా ఫ్యాన్స్ కూడా పెద‌వి విరిచారు. ఓపెనింగ్స్‌లో దుమ్ము రేగ్గొట్టిన ఈ సినిమా ఆ త‌ర‌వాత బాగా డ‌ల్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ సినమాకు అంత కాంపిటీషన్ లేక పోయినా   ఆ త‌ర‌వాత కొత్త సినిమాలు వ‌చ్చేస్తాయి.. స‌త్య‌మూర్తి సైడ్ అయిపోతుంది.  మొత్తం మ్మీద ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్ దాట‌డం క‌ష్ట‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు తేల్చేస్తున్నాయి.  ఒక వేళ అలా గనక జరిగితే గతంలో కొన్ని సినిమాలు హీరో, డైరెక్టర్ ఇమేజ్ ని నమ్ముకొని బయ్యర్లు పెట్టుబడి పెట్టారు కాని ఘోరంగా నష్ట పోయారు.


సన్నాఫ్ సత్యమూర్తి పోస్టర్ 


ఇప్పుడు ఈ సినిమా పరిస్థతి అలానే కనిపిస్తుంది.... కానీ త్రివిక్ర‌మ్ మాత్రం ఈ రిజ‌ల్ట్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాస్తవానికి బన్నిని ‘జులాయి’ లాంటి రఫ్ అండ్ టఫ్ సిమాల్లో అయితే బాగా పనికి వస్తాడు సెంటిమెంట్ సినిమాల్లో నటింప జేయటం అనేది కత్తి మీద సాములాంటిది. అంత స్టయిలిష్ హీరోని పూర్తి గా కుటుంబ నేపథ్యంలో ఉండే సినిమాలో నటింప చేయడం కష్టమైన పనే అయినా మనోడు నటించి మెప్పించాడు.  ఈ మాత్రం వ‌సూళ్ల‌యినా ద‌క్కినందుకు హ్యాపీగా ఉన్నాడ‌ట‌. ఈ సినిమా 50 - 50 అని ముందే అనుకొన్నాడ‌ట‌. అయితే తాను అనుకొన్న‌దానికంటే మంచి రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని ఫీల‌వుతున్నాడ‌ట‌. అంతేకాదు.. పారితోషికం ప‌రంగానూ త్రివిక్ర‌మ్‌కి బాగానే పనైంది. దాదాపుగా రూ.15 కోట్ల వర‌కూ ముట్టాయ‌ట‌.  


మరింత సమాచారం తెలుసుకోండి: