సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరోయిన్లు డబుల్ రోల్స్ చేయడానికి ఇష్ట పడరు. ఎందుకంటే ఇలా చేస్తే సినిమా మొత్తం వారిమీదనే నడుస్తుంది. దీంతో వారు బోర్ ఫీల్ కావడం రిస్క్ ఎక్కువ ఉండటం దీంతో డబుల్ రోల్ అంటే ఇష్ట పడరు.   అయితే లేటెస్ట్ గా ఓ టాప్ హీరోయిన్ ద్విపాత్రాభినయం చేసి మనకు సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. అబ్బా ఈ కాలానికి ఇంత రిస్క్ చేస్తున్న ఆ భామ ఎవరా అనుకుంటున్నారా ఏం మాయ చేశావే అంటు తెలుగు తెరకు పరిచయం అయిన సమంత...అవునండీ ఈ బ్యూటీ   విక్రమ్‌తో ‘10 ఎన్‌రాదుకల్ల’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో సమంత డబుల్ రోల్‌లో నటిస్తోందట.. ప్రస్తుతం నేపాల్‌లో ఈ రెండు డిఫరెంట్ లుక్స్‌లో షూటింగ్ జరుగుతోందని సమాచారం.


సమంత హాట్ పిక్


ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ రోల్స్‌ చేయనుండటం నా అదృష్టంగానే భావిస్తున్నాను.  రెండు పాత్రలు రెండు రకాల స్వభావాన్ని కలిగినవి ఒకదానితో ఒకటి పోల్చు కున్నేట్టు ఉండవు ఒకటి నేపాలి యువతి పాత్ర అయితే, రెండోది గ్లామరస్‌గా ఉంటుంది. రెండో పాత్రలు ఇప్పటి వరకే చేసినా.. మొదటి పాత్ర మాత్రం చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. దీని కోసం నా బాడీ లాంగ్వేజ్‌, హెయిర్‌స్టైల్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ అంటూ నన్ను నేను కొత్తగా చూపించుకోవాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: