‘వన్’ సినిమా పరాజయం తరువాత అతి కష్టం పై జూనియర్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పొందడానికి సుకుమార్ జూనియర్ ఇంటి చుట్టూ చాల సార్లు తన స్క్రిప్ట్ తో తిరిగాడు. ఎట్టకేలకు తన కథను జూనియర్ లైన్ క్లియర్ చేయడంతో మే 14వ తారీఖు నుండి ఈ సినిమా షూటింగ్ ను లండన్ లో ప్రారంభిస్తున్నాడు సుకుమార్. 

ప్రస్తుతం టాప్ హీరోలు అంతా సెంటిమెంట్ ను ప్రతిబింబించే టైటిల్స్ ను తమ సినిమాలకు పెట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో సుకుమార్ జూనియర్ల సినిమాకు ‘నాన్నకి ప్రేమతో’ అన్న టైటిల్ ను  జూనియర్ అంగీకారంతో ఒకే చేసుకున్నారు. ఫిలిం చాంబర్ లో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది.

అయితే ఈ టైటిల్ బయటకు వచ్చిన తరువాత జూనియర్ సన్నిహితులు ఆశ్చర్య పోయి ఒక విషయాన్ని జూనియర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. జూనియర్ ఇప్పటి వరకు నటించిన 25 సినిమాలలో ‘న’ అన్న అక్షరంతో టైటిల్స్ పెట్టిన సినిమాలు అన్నీ జూనియర్ కెరియర్ లో ఘోరమైన ఫ్లాపులుగా మిగిలాయి. గతంలో వచ్చిన ‘నాగ’, ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’ జూనియర్ కెరియర్ లో పీడకలలుగా మిగిలాయి.

ఈ సెంటిమెంట్ జూనియర్ దృష్టికి రావడంతో ఉలిక్కి పడ్డ జూనియర్ సుకుమార్ ను సంప్రదించి ఈ సినిమాలో ‘నా’ అక్షరానికి ముందు ‘మా’ అక్షరాన్ని చేర్చి ‘మా నాన్నకి ప్రేమతో’ అనే విధంగా ఈ సినిమా టైటిల్ ను మార్చమని సుకుమార్ ను జూనియర్ కోరాడు అని టాక్. ముందుగా జూనియర్ టైటిల్ విషయంలో చెప్పిన మార్పుకు కొద్ది సేపు అయోమయంలో పడ్డ సుకుమార్ ఆ తరువాత జూనియర్ చెప్పినట్లుగా ఈ సినిమా టైటిల్ లో మార్పులు చేసాడు అని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో నాన్న సెంటిమెంట్ తో వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్న నేపధ్యంలో జూనియర్ కూడా ఈ నాన్న సెంటిమెంట్ ను ఫాలో అవుతూ చేస్తున్న ప్రయోగం ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..







మరింత సమాచారం తెలుసుకోండి: