వచ్చేనెలలో జరగబోతున్న మంచు మనోజ్  పెళ్ళికి  రావలిసిoదిగా నటుడు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి నప్పుడు ఆయన మోహన్ బాబు కుటుంబానికి సాదర స్వాగతం చెప్పడంతో మోహన్ బాబు తిరిగి భారతీయ జనతాపార్టీ వైపు చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించినా మోడీ మోహన్ బాబు కుటుంబం పట్ల చూపించిన అభిమానం వెనుక ఎదో ఒక ఎత్తుగడ ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఈవార్తలు ఇలా ఉండగా మోహన్  బాబు సకుటుంబంగా  మోడీని కలిసిన నేపధ్యంలో పవన్ చేయలేనిది  మోహన్ బాబు చేసి చూపెట్టాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఆ మధ్య తుళ్ళూరు ప్రాంతంలో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న పవన్  వారి సమస్యలను తీర్చడానికి పోరాటం చేస్తాను అని చెప్పడమే కాకుండా త్వరలో తాను ఈ విషయమై  ప్రధాన మంత్రి నరెంద్రమోడీని కూడా కలుస్తాను అని మీడియా సాక్షిగా చెప్పాడు పవన్. 

అయితే ఈ సంఘటన జరిగిపోయి నెలలు గడిచి పోతున్నా పవన్ మోడీల సమావేశం జరగలేదు. గత సంవత్సరం ఎన్నికలలో  భారతీయ జనతాపార్టీకి ఓట్లు వేయించిన పవన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల సమస్యల పై ప్రత్యేక రాష్ట్ర హోదా పై నరెంద్రమోదీని ఇప్పటికీ కలవలేక పోవడం సమాధానం లేని ప్రశ్నగా మారిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ మోహన్ బాబు మాత్రం  తన కొడుకు మంచు మనోజ్  పెళ్ళి శుభలేఖ సాకుతో మోడీని కలవడమే కాకుండా ఆయన చేత మర్యాదలు  కూడ పొంది ఏమి మాట్లాడాడు అన్న విషయం  పై  రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే పవన్ అభిమానులు  మాత్రం తమ హీరో పవన్ కు దక్కవలసిన మర్యాదలు మంచు కుటుంబం పొందడం పై గుర్రుగా ఉన్నారని టాక్..     








మరింత సమాచారం తెలుసుకోండి: