నందమూరి నటసింహం బాలక్రిష్ణ నటించబోతున్న అప్ కమింగ్ 100వ చిత్రంపై ఇండస్ట్రీలో అప్పుడే అంచాలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నందమూరి బాలక్రిష్ణ వెండితెరపై 4 దశాబ్దాలకు పైగా అగ్రస్థానాన్ని చేజిక్కికుంటూ వస్తున్నాడు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ త్వరలోనే 100వ సినిమాలో నటించబోతున్నాడు. బాలయ్య బాబు ప్రస్తుతం చేసిన ‘లయన్’ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీని తరువాత ప్రారంభంకానున్న అతని 99వ సినిమా డిక్టేటర్ ని శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు. అయితే చారిత్రాత్మకమైన తన 100వ సినిమాను బోయపాటి శ్రీను చేతిలోపెట్టినట్టు సమాచారం.

బోయపాటి ఇప్పటికే బాలయ్య 100వ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్స్ ని అద్భుతంగా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రంగా బాలయ్య 100 వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన కొన్ని లీక్డ్ పాయింట్స్ ని మీకు అందిస్తున్నాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి.

వాటిల్లో 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఒకటి. అలాగే సమంత బాలయ్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు. టాలీవుడ్ కి చెందిన అగ్రహీరోలు బాలయ్య 100వ సినిమాలో కనిపించే అవకాశం సైతం ఉందనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి చరిత్రకు ఒక్కడు అనే నామకరణం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: