ఎన్నో భారీ అంచనాలతో నిన్న విడుదలైన నాగచైతన్య సినిమా ‘దోచేయ్’ డివైడ్ టాక్ తెచ్చుకుంది.  గతంలో చాలా సినిమాలను రక్షిoచిన బ్రహ్మానందం కామెడీ మాత్రమే ఈసినిమాను రక్షించ గలుగుతుంది అన్న ఆశలో చైతూ అభిమానులు ఉన్నారు. 

ఈసినిమాలో బుల్లెట్ బాబుగా  బ్రహ్మి క్యారెక్టర్ ఎంటరై సీనియర్ స్టార్స్‌ పై సెటైర్స్ వేస్తూ హీరో చేతిలో బకరా అవడం సీన్స్ చూసిన టాప్ హీరోల అభిమానులు ఈసినిమా దర్శకుడు సుధీర్ వర్మ  పై సెటైర్లు వేస్తున్నారు. కేవలం తాను తీసిన రెండో సినిమాలోనే హీరోలపై సెటైర్స్ వేసేంత సీన్ సుధీర్‌కు లేదని దీన్ని ‘స్వామిరారా’ సీక్వెల్‌లా డిజైన్ చేసి నాగచైతన్య కెరియర్ పై  అనవసరపు ప్రయోగాలు చేసాడు అంటూ చైతన్య అభిమానులు గోలపెడుతున్నారు. 

క్రైమ్ కామెడీ అని ప్రమోట్ చేసి పావుగంటకో కామెడీ పంచ్ బ్రహ్మీ చేత వేయించినా ఈ సినిమా కమర్షియల్ గా విజయవంతం కావడం కష్టం అన్న మాటలు  చైతన్య అభిమానుల దగ్గర నుంచే వస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఇక బ్రహ్మి  రోల్ ద్వారా ఎవరిపై సెటైర్స్ వేసిందనే కామెంట్స్ పక్కనపెట్టితే ‘పటాస్’‌లో ఎమ్మెస్, ‘లౌక్యం’లో పృధ్వీ రోల్స్‌ను కాపీ చేసినట్లుగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సీనియర్ హీరోల విగ్గులు బట్టతలల పై కామెంట్ చేస్తూ వారి బాడీ లాంగ్వేజ్ ని అనుసరిస్తూ బ్రహ్మీ వదిలిన పంచ్ లు సీనియర్ హీరోలకు అతి అనిపించడమే కాకుండా వారికి దర్శకుడు సుధీర్ వర్మ పై కోపం తెప్పించిందని తెలుస్తోంది. కనీసం హీరో హీరోయిన్ ఆన్ స్క్రిన్ కెమిస్ట్రీ నప్పుతుందో లేదో తెలియకుండా దర్శకులు సినిమాలు తీయడం  ఏమిటని విమర్శకులు సుధీర్ వర్మను టార్గెట్ చేస్తునారు..




మరింత సమాచారం తెలుసుకోండి: