హాలీవుడ్ సినిమాలను భారత దేశంలో చాలా బాగా ఆదరిస్తారు. ఒక్కోసారి ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే వామ్మో అనిపించేలా.. అయితే ఈ సమ్మర్ సీజన్ కి అందరి మనసు ‘దోచేయ్’ డానికి అక్కినేని నాగ చైతన్య వచ్చాడు.  నాగ చైతన్య – కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో   ‘దోచేయ్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది... కానీ ఈ క్రేజీ హాలీవుడ్ ది అవెంజర్స్ సినిమా వల్ల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ బాగానే పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియాలోని మేజర్ సిటీలలో, మల్టీ ప్లెక్సుల్లో అంతా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంది.


దోచేయ్ మూవీ స్టిల్



బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది సేపట్లోనే టికెట్స్ హాట్ కేక్స్ లా అయిపోయాయి. ఈ సినిమాకున్న క్రేజ్ వల్ల మల్టీ ప్లెక్స్ వారు ఈ వీకెండ్ ఎక్కువ అవెంజర్స్ కి ఎన్ని కుదిరితే అన్ని షోలు వేస్తున్నారు. ఇప్పుడు చైతూ  సినిమా ‘దోచేయ్’కి ఈ హాలీవుడ్ సినిమా పెద్ద యమగండంలా తయారైంది. ఎందుకంటే ది అవెంజర్స్ వల్ల మొదటి వీకెండ్ మల్టీప్లెక్స్ మరియు మేజర్ సిటీలలో దోచేయ్ కి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని ముందుగానే ఊహించినట్లు పడ్డట్లే అనిపిస్తుంది. మరి వారాంతపు కలెక్షన్లు ఎలా ఉంటాయి వేచి చూడాల్సిందే...


ది అవేంజర్స్ చిత్రం స్టిల్




మరింత సమాచారం తెలుసుకోండి: