మెగస్టార్ చిరంజీవి  గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కథానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. మెగస్టార్ స్టాలిన్ సినిమా తర్వాత ముఖానికి రంగు వేసుకోలేదు.

మెగాస్టార్ చిరంజీవి


రాజకీయ ప్రస్థానం అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అంటే ముఖానికి రాజకీయ రంగు వేసుకున్నాడు. ప్రజారాజ్యం అంటూ ప్రజల ముందు బొక్కబోర్లా పడ్డాడు. అలాగని కాంగ్రెస్ అధికార పార్టీలో ఉండి కూడా ఉమ్మడి  రాష్ట్రానికి ఏమీ చేయలేక పోయాడు. అసలు చిరంజీవి రాజకీయాల్లో  నామ్ కే వాస్తే అన్నట్లు ఉన్నాడు. దీంతో అయన అభిమానులు, ఆయన సన్నిహితులు రాజకీయ రంగం నుంచి బయటపడమని సలహాలు ఇవ్వడం మొదలైంది. చిరంజీవికి ఇప్పడు మళ్లీ సినిమా వైపు గాలి మళ్లింది.  

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి


మొఖానికి మళ్లీ రంగు వేసుకుంటాడట..? అనే వార్త రాగానే మెగాస్టార్ అభిమానులు ఎగిరి గంతు వేశారు. రెండు సంవత్సరాల నుంచి ఈ మాట చెబుతూనే ఉన్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు అంతే కాదు డైరెక్టర్లు, సినిమా కథలు అంటూ రక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ చిరంజీవి మళ్లీ సినిమాల్లో కనిపిస్తాడా లేదా అన్న డౌట్ కొంతమందికి వస్తుంది. అంతే కాదు ఇప్పడు టాలీవుడ్ లో కుర్ర హీరోలకు ధీటుగా నిలబడాలంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండాలో వేరే చెప్పనక్కర లేదు. అయితే ‘అలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు సినిమానే లేదు కథే లేదు కొత్త కొత్త రూమర్లు మటులకు చిరుపై వస్తున్నాయి.

జగదేక వీరుడు..అతిలోక సుందరి లో శ్రీదేవి, చిరు



జగదేక వీరుడు .. అతిలోక సుందరి.. అందాల తార శ్రీదేవి ఈయన సరసన నటిస్తున్నట్లు కొంతమంది లేదు లేదు చిరు తల్లిగా నటించ బోతుందని కొంతమంది రక రకాల రూమర్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి చిరంజీవి ముఖానికి రంగు వేసేదెప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు అంతా అగమ్య గోచరంగా ఉంది కదా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గం వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: