ఈరోజు ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండులో సంభవించిన భూకంపం తీవ్రతకు  భారీ అంతస్తుల భవనాలు కూలిపోవడమే కాకుండా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖాట్మండ్ మొత్తం దుమ్ము, దూళితో నిండిపోయింది. ఈ తీవ్ర భూకంప తాకిడి మధ్య మన తెలుగు సినిమాకు సంబంధించిన ఒక ఫిలిం యూనిట్ కూడ చిక్కుకుంది అన్న వార్తలు వస్తున్నాయి.


ఖాట్మండ్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా  ప్రస్తుతం నేపాల్ లో షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్ళిన దీంతో సినిమా షూటింగ్ కోసం ఖాట్మాండు వెళ్లిన యెటకారం సినిమా యూనిట్ కు సంబంధించిన 20 మంది తెలుగువాళ్లు ఈ ఆపదలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్ వీరేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యూనిట్ తమ సినిమా షూటింగ్ నిమిత్తం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుండి ఖాట్మండ్ వెళ్ళినట్లు తెలుస్తోంది.

మొదట నాలుగు రోజులపాటు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో షూటింగ్ జరుపుకున్న యూనిట్ అనంతరం అక్కడి నుంచి నేపాల్ వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితమే ఖాట్మాండులో షూటింగుకి అంతా ఏర్పాట్లు చేసుకున్న నేపధ్యంలో ఈ యూనిట్ యోగ క్షేమాలు తెలుసు కుందామని ఈ యూనిట్ కు సంబంధించిన వ్యక్తులు ప్రయత్నిస్తున్నా అక్కడి ఫోన్స్ పనిచేయక పోవడంతో ఎటువంటి సమాచారం కూడ తెలియడం లేదని అంటున్నారు. 

ఈ వార్తలు ఇలా ఉండగా హైదరాబాద్ మల్కాజ్ గిరి లోని వినాయక్ నగర్ కు సంబంధించిన 25 మంది తెలుగువారు ఆ భూకంపంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విజయనగం, శ్రీకాకుళం, కాకినాడ, రాజానగరం, రాజమండ్రి, అమలాపురం అనేక ప్రాంతాలలో  ఈ భూకంపం ప్రజలను కొన్ని సెకన్ల పాటు జనాన్ని విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసింది. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాలకు ఈరోజు ఈ భూకంపం పెద్ద షాక్ ఇచ్చింది..
 






మరింత సమాచారం తెలుసుకోండి: