సినీరంగంమంటేనే అదృష్ట దేవత అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రంగంలో ఉన్నంత అనిశ్చితి ఇంకెక్కడా ఉండదేమో. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారిలో చాలా మంది ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా నటులు.. కేవలం సినిమాలపైనే తమ డబ్బు ఇన్వెస్టు చేసి ఊరుకోరు.


పాతతరం నటుల్లో శోభన్ బాబును మంచి బిజినెస్ మెన్ గా చెప్పేవారు. ఆయన నటుడుగా ఉండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేశారు. మురళీమోహన్ కూడా ఆయన బాటలోనే వెళ్లారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా అనేక వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. 


ఇప్పటికే సినీనిర్మాణం రంగంలో ఉన్న ఆయన దీంతోపాటు కన్ స్ట్రక్షన్ బిజినెస్, ఎంటర్ టైన్ మెంట్, కన్వెన్షన్ సెంటర్, మీడియా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ఓ ప్రముఖ ఛానళ్లో ఆయనకు షేర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందులో షేర్లు అమ్మేశారు. 


తాజాగా జరిగిన ఓ ఫంక్షన్ లో నాగార్జున కొత్తగా ఏం బిజినెస్ చేయబోతున్నారన్న టాపిక్ వచ్చింది. ప్రోగ్రామ్ యాంకర్ నేరుగా నాగార్జుననే ఆ విషయం అడిగేశారు. దీంతో నాగార్జున నవ్వేసి.. ఇంకా కొత్త బిజినెస్ లు ఏమీ లేవు.. కొత్త సినిమాలే చేస్తానని బదులిచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: