చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియక పోయినా ఆ సినిమా వార్తలకు  సంబంధించి ఎదో ఒక విషయం మీడియాలో హడావిడి చేస్తూనే ఉంటుంది. అయితే చిరంజీవి విమర్శకులు అతి త్వరలో షష్టిపూర్తి  చేసుకోబోతున్న చిరంజీవి తన సినిమాలతో ప్రేక్షకులను ఎక్కడ మెప్పించగలడు అని సెటైర్లు వేస్తూనే  ఉన్నారు. 

అయితే చిరంజీవి తన 150వ సినిమా గురించి ఈమధ్య తన లుక్ ను మార్చుకుంటూ తెగ కష్టపడుతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. కొందరైతే చిరంజీవి తన న్యూలుక్ తో  పూర్తిగా మారిపోయాడు అంటూ వార్తల హడావిడి కూడ చేసేస్తున్నారు.  దీనికి సంబంధించి చిరంజీవితో తీయించుకున్న ఒక సెల్ఫీ ఫోటో ఇప్పుడు వెబ్ మీడియాలో హల్ చల్  చేస్తోంది.

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలో నటించిన సుధాకర్‌ రెండ్రోజుల క్రితమే చిరంజీవిని కలిసినపుడు తీసుకున్న సెల్ఫీ ఫోటో ఇది. ఈ ఫోటోను సుధాకర్ వెబ్ మీడియాలో పెట్టిన తరువాత చిరంజీవి ఎంతలా కళకళలాడిపోతున్నాడో అంటూ అభిమానులు ఈ ఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకు కథ దర్శకుడు హీరోయిన్ ఇలా ఏ విషయంలోనూ క్లారిటీ లేకుండా గత సంవత్సర కాలంగా  కేవలం గాసిప్పులకు మాత్రమే పరిమితం అయిన  చిరంజీవి  150వ సినిమా న్యూ లుక్ కు సంబంధించి ప్రస్తుతం  ఈ సెల్ఫీ ఫోటో హడావిడి చిరంజీవి సినిమాకు మరో కొనసాగింపు. ఈ ఊహలకు చిరంజీవి  ఎప్పుడు తెర దించుతాడో చూద్దాం..   






మరింత సమాచారం తెలుసుకోండి: