గతకొద్ది రోజులుగా టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ మీడియాలో వస్తున్న వార్తలతో టాప్ హీరోలు తీవ్ర అసహనానికి లోను అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కొనసాగింపుగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్  టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు మీడియాలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. 


కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు

హీరోలకు ఒక నిర్మాత పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడితే, మరో నిర్మాత పదిహేను కోట్లు ఇస్తానంటూ ఆ హీరో డేట్స్ దక్కించుకుంటున్నాడు అంటూ ఇలాగే చేస్తూ పోతే రాబోయే రోజుల్లో నిర్మాతలుండరు అంటూ  షాకింగ్ కామెంట్స్ చేసాడు కళ్యాణ్. అంతేకాదు ఇక భవిష్యత్ లో టాప్ హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారి  సినిమాలు తీసుకోవాల్సి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు కళ్యాణ్.


‘ఉత్తమ విలన్’ ప్రమోషన్ సందర్బoగా కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసాడు

వచ్చేనెల మే 1న విడుదల కాబోతున్న కమలహాసన్ ‘ఉత్తమ విలన్’ ప్రమోషన్ సందర్బoగా కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసాడు. కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆశక్తి కనబర్చడంలేదని తమ  ఇంటి నుంచి కదలడానికి, క్యారవాన్ నుంచి కాలు బయటపెట్టడానికి ఫీలైపోతూ తమని తాము చాల ఎక్కువ స్థాయిలో  ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించాడు ఈ సంచలన నిర్మాత.


కళ్యాణ్  చేస్తున్న ఈ వ్యాఖ్యలతో


ఇప్పటికే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అనే రెండు భాగాలుగా విడిపోయిన నేపధ్యంలో కళ్యాణ్  చేస్తున్న ఈ వ్యాఖ్యలతో టాప్ హీరోలు మరింత ఇరుకున  పడటం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ లో ఇదే పరిస్థితి కొనసాగితే ఇక రానున్న కాలం అంతా టాప్ హీరోలకు గడ్డు కాలమే అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: