మరోసారి గబ్బర్‌సింగ్‌ 2  ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు పవన్‌  ఆయన హీరోగా తెరకెక్కనున్న గబ్బర్‌సింగ్‌ 2  మే లో  మొదలుకానుంది నాక్కొంచెం తిక్కుంది కాని దానికో లెక్కుంది. అంటూ గబ్బర్‌సింగ్‌ లో పవన్‌ చేసిన డైలాగ్ అభిమానుల్లొ సందడి చేసింది. ఆ చిత్రం విడుదలైన వెంటనే దానికి కొనసాగింపుగా మరో సినిమా చేయడంపై మొగ్గు చూపారు పవన్‌. తన సొంత సంస్థ పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు.

పవన్‌ చేసిన డైలాగ్ అభిమానుల్లొ సందడి చేసింది


స్వయంగా స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తూ సినిమాను ప్రారంభించారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ  కొలిక్కి రావడంతో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. శరద్ మరార్ మాట్లాడుతూ భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

పవన్  స్టోరీ రాయడం 


అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం అని శరత్‌మరార్ వివరించారు. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్  స్టోరీ రాయడం అభిమానుల్లొ  ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే గబ్బర్‌సింగ్ 2 స్క్రిప్టు విషయంలో పవన్  పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారని చెప్పుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: