ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లయన్. లయన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎలా ఉంటుందా? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే లయన్ రిలీజ్ కి చిన్న చిన్న సమస్యలు అడ్డంకులుగా మారుతున్నాయి.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘లెజెండ్’లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ నుంచి వస్తున్న మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ‘లయన్’ సినిమా రిలీజ్ విషయంలో ఎప్పటికప్పుడే డేట్స్ మారుకుంటూ వస్తున్నాయి.

మొదట లయన్ మూవీని మే 1న రిలీజ్ చేయాలనుకున్నారు, ఆ తర్వాత ఏప్రిల్ 30 అన్నారు, మళ్ళీ మే 1న అన్నారు. కానీ తాజాగా ఈ సినిమా మే 1న కూడా రిలీజ్ కావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అన్నీ అనుకున్నట్టు కుదిరితే మే 7న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ టైంకి కూడా రెడీ అవ్వకపోతే వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: