టాలీవుడ్ సినిమాలో తేజ అనే బ్రాండ్ కి గ్రాండ్ వాల్యూ ఉంది. కాని ప్రస్తుతం మాత్రం ఆ బ్రాండ్ కలిగి ఉన్న తేజ, ఫాంలో లేక కామ్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తేజ సూపర్ బిజినెస్ డీల్ ని కుదుర్చుకోబోతున్నాడు.

దీనికి సంబంధించిన డిటైల్స్ లోకి వెళితే, తెలుగు సినిమాలో లో-బడ్జెట్‌తో ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించిన ఫిల్మ్ మేకర్‌గా తేజకు పేరుంది. ఇప్పుడాయన చేస్తున్న మరో కొత్త ప్రయోగం హోరాహోరి'. తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణులు, కళాకారులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆరోపణల నేపథ్యంలో తన కొత్త సినిమాకు అవసరమైన వాళ్లందరినీ తెలంగాణ నుంచే తీసుకున్నానని చెబుతున్నాడు తేజ.

సినిమాటోగ్రాఫర్‌, కొరియోగ్రాఫర్‌, స్టంట్‌ మాస్టర్‌,మ్యూజిక్‌ కంపోజర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌, మేకప్‌మెన్‌, లైట్‌మెన్‌..ఇలా అవసరమైన అన్ని విభాగాల వారిని తెలంగాణ ప్రాంతం నుంచే తీసుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలా జరగడం తొలిసారని సినీవర్గాలు అంటున్నాయి.

సాధారణంగా ఫిల్మ్‌మేకర్స్‌ తమకు నచ్చినవారిని ఎంపికచేసుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యతని ఎపి ఫిలింఛాంబర్‌కే ఇచ్చేవి. కానీ మొదటిసారి ఒక సినిమాకు అవసరమైన సిబ్బంది మొత్తాన్ని తెలంగాణ ఫిలింఛాంబర్‌ నుంచి తీసుకున్న తొలి ఫిల్మ్‌ మేకర్‌గా తేజ గుర్తింపు పొందాడని అంటున్నాయి సినిమా యూనిట్‌ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: