‘జనసేన’  అధినేత  పవన్ కల్యాణ్‌కి  మరొక కొత్త తలనొప్పి మొదలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తుళ్ళూరు ప్రాంతంలో ఆయన రైతులను కలిసినప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ ను వేరే విధంగా వెంటాడుతున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను వారికోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పవన్ ఆరోజు తుళ్ళూరు ప్రాంత రైతులతో అన్న మాటలు  ఇప్పుడు  పవన్ ను భోగాపురం  ఉచ్చులో ఇరికించాయి అన్న వార్తలు వస్తున్నాయి.

విజయనగరం దగ్గర ఉన్న భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సుమారు 15వేల ఎకరాలను రైతులనుండి ప్రభుత్వo బలవంతంగా తీసుకునే పరిస్థితులు ఏర్పడటంతో పవన్ కు ఈ కొత్త సమస్య వచ్చింది. ఈ భూములు కోల్పోయేవారిలో ఎక్కువ మంది పవన్ సామాజిక వర్గం వారు కావడం పవన్‌కల్యాణ్‌ని మరింత ఇబ్బందుల్లో నెట్టింది అని టాక్. దీనితో పవన్ మరో ఉచ్చులోపడి అటు ప్రధాని మోదీనిగానీ ఇటు ఏపీ సీఎం చంద్రబాబుని గానీ సమర్థించ లేక వ్యతిరేకించ లేక తన దగ్గరకు వస్తున్న భోగాపురం రైతు ప్రతినిధులను కలవకుండా తప్పించుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. 


ఈమధ్య తనను తరుచూ కలుస్తున్న రాజకీయ ప్రముఖులతో పవన్ వర్తమాన రాజకీయ వాతావరణం పైనే చర్చిస్తూ ఈ ప్రభుత్వాలు అనవసరంగా రైతుల జోలికి ఎందుకు వెళ్తున్నాయని, పవన్ మధనపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేసిన నేపధ్యంలో పవన్ స్పందించడంలేదు అని కామెంట్స్  వస్తున్న నేపధ్యంలో ఊహించని ట్విస్ట్ గా ఈ భోగాపురం వ్యవహారం కూడా కలవడంతో పవన్ మరింత మానసిక సంఘర్షణకు లోనవుతున్నట్లు టాక్. 


నిన్న గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంపై సంజీవరావు అనే ఒక సామాన్యుడు టెలిఫోన్ టవర్ ఎక్కి  మండుటెండలో హంగామా సృస్టించిన నేపధ్యంలో అక్కడకు వచ్చిన కొంతమంది సామాన్యులు  కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయమై వారివారి స్థాయిలో స్పందిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మౌనం వీడడా అని  కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో పవన్ పిలుపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు  ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది..





మరింత సమాచారం తెలుసుకోండి: