ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మనస్టార్‌ హీరోలకు వారసత్వం వారి తండ్రుల వద్ద నుండే వస్తుంది. ఆ కోవలోనే ప్రిన్స్‌ మహేష్‌బాబుకి తండ్రి పాత్రలో కృష్ణ నటించారు.


కొడుకు దిద్దినకాపురం, గూఢాచారి 117 లాంటి సినిమాల్లో తండ్రీకొడుకులుగా కలిసే నటించారు. నాగ్‌కు తండ్రిపాత్రలో ఎఎన్నార్‌, మనం చిత్రంలో వెరైటీగా చైతూ ,నాగార్జునకే తండ్రి పాత్రలో మెప్పించారు. ఎన్టీఆర్‌కు తండ్రిగా బాబాయ్ బాలయ్య, ప్రభాస్‌కి తండ్రి పాత్రలో పెద్దనాన్న కృష్ణంరాజు కన్పించిన సందర్భాలున్నాయి.


ఎన్టీఆర్‌కి రియల్‌లైఫ్‌ ఫాదర్‌ హరికృష్ణ


తాజాగా ఎన్టీఆర్‌కి రియల్‌లైఫ్‌ ఫాదర్‌ హరికృష్ణ మాత్రం అతడికి తండ్రిగా నటించిందే లేదు ఇంతవరకు. కానీ అది త్వరలో సాధ్యమవుతోందని సమాచారం. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ' మా నాన్నకు ప్రేమతో' మే 15న లండన్‌లో ప్రారంభవుతోందనే విషయం తెలిసిందే. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలోని సినిమా ఇది.


ఎన్టీఆర్‌ కు తండ్రిగా జగపతిబాబు, లేదా సూపర్‌స్టార్‌ కృష్ణ నటిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి.అయితే ఇపుడు హరికృష్ణ నటిస్తేనే బావుంటుందని సుకుమార్‌ భావిస్తున్నారట. ఇందుకు హరి ఓకే అన్నట్టు కూడ సమాచారం. ఈ న్యూస్ ని త్వరలోనే అఫిషయల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: