బాలీవుడ్ లవర్ బాయ్ లిస్టులో ముంత్లదు వరుసలో ఉంటాడు హీరో షాహిద్ కపూర్. కరీనా కపూర్ నుంచి ప్రియాంక చోప్రా వరకు ఎవరినీ వదలకుండా.. అందరితో హాట్ ఎఫైర్లు మెయింటైన్ చేసిన ఈ అందగాడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఢిల్లీకి చెందిన అమ్మాయి మీరా రాజ్ పుత్ తో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు షాహిద్. అయితే ఈ లవర్ బాయ్ మ్యారేజ్ డిసెంబర్ లో ఉంటుందని అంతా అనుకున్నారు.


షాహిద్ కపూర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయట


కానీ అంతకంటే ముందే.. అంటే జూన్ లోనే షాహిద్ కపూర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయట. మ్యారేజ్ ఆరు నెలలు ముందుకు జరగడంతో.. మనోడు కమిట్ అయిన ఓ సినిమా వెనక్కి జరిగిందట.తెలుగులో డి.. ఫర్ దోపిడి సినిమాను తెరకెక్కించిన రాజ్ నిడమూరు, కృష్ణ డీకే.. షాహిద్ కపూర్ హీరోగా ఓ మూవీని ప్లాన్ చేశారు.


ఇటీవలే హ్యాపీ ఎండింగ్ తో ఖంగు తిన్న ఈ దర్శక ద్వయం.. షాహిద్ తో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేశారట. ప్రస్తుతం స్కిప్టుకి ఫైనల్ టచ్ ఇస్తున్న రాజ్ అండ్ డీకే.. ఈ సినిమాను జూన్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించారు. అయితే షాహిద్ కపూర్ ఆ టైంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో.. ఆ ప్రాజెక్టును వాయిదా వేయక తప్పలేదు దర్శకులకు.


మ్యారేజ్ అయిన తర్వాత కూల్ గా సినిమా చేద్దామని షాహిద్ కూడా చెప్పడంతో.. స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట రాజ్ అండ్ డీకే. అయితే ప్రస్తుతం పెండింగ్ లో రెండు సినిమాల పరిస్థితి సైతం ఆలస్యంగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకోవలసి వస్తుంది. దీనికి నిర్మాతలకు దాదాపు 12 కోట్ల రూపాయలకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: