గంధపు చక్కల స్మగ్లింగ్ వ్యవహారంలో హీరోయిన్ నీతూ అగర్వాల్ అరెస్ట్ కావడంతో నేటి టాలీవుడ్ ను శాసిస్తున్న మాఫియ ముసుగులో టాలీవుడ్ కు వరద గోదావరిలా వచ్చి పడుతున్న నల్లధనం విషయమై ఈరోజు ఒక  ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఆ శక్తికర విషయాలను ప్రచురించింది. టాలీవుడ్ సినిమా రంగానికి మాఫియా మరియు నల్లధన విషయాలకు లింక్స్ ఉన్నాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నా లేటెస్టుగా అరెస్టు అయిన మస్తాన్ వలీ నీతూ అగర్వాల్ ల వ్యవహారంతో మరోసారి ఈచర్చ మళ్ళీ తెర పైకి వచ్చింది. 

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ


ఈ విషయమై ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ గ్లామర్ ప్రపంచంగా ఎందర్నో ఆకర్షిస్తున్న టాలీవుడ్ సినిమారంగంలో నిర్మాతగా మారి  ఒకసినిమా తీస్తేచాలు పేరుతో  పాటు ఫ్రీ పబ్లిసిటీ ఏర్పడి  తమ నల్లధానాన్ని తెల్ల ధనంగా మార్చుకోవచ్చు అన్న అభిప్రాయం ఏర్పడటంతో వందల సంఖ్యలో టాలీవుడ్ లో సినిమాలు తీసేవారి సంఖ్య పెరిగి  పోతోంది అంటూ కామెంట్స్ చేసాడు భరద్వాజ. ఇదే విషయమై స్పందిస్తూ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ  వ్యవహారం పై మరొక విధంగా కామెంట్ చేసాడు. 

రెడ్ సాండిల్ వుడ్


టాలీవుడ్ సినిమా రంగంలో నిర్మాతగా  మారడానికి ఎవరకీ ఎటువంటి అర్హతలు లేకుండా ఒక ఓపెన్ మార్కెట్ గా టాలీవుడ్ తయారవడంతో ప్రస్తుత సినిమా  రంగం పై ఎవరికీ ఎటువంటి అదుపూ అజమాయిషీ లేకపోవడంతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని సురేష్ బాబు భావన. డ్రగ్స్, రియల్ ఎస్టేట్, మాఫియా శాoడిల్ వుడ్ లాంటి  అక్రమ వ్యాపారాలలో వచ్చిన వందలాది కోట్ల రూపాయలను  చెల్లుబాటు చేసుకునే  మార్గంగా నేడు చాలామంది  అక్రమ ఆర్జన పరులు టాలీవుడ్ ను వేదికగా చేసుకుని  చేస్తున్న బినామి వ్యాపారాల వల్ల టాలీవుడ్ ప్రతిష్ఠ రోజురోజుకు దిగజారి పోతోంది అంటూ ఆ పత్రిక షాకింగ్  కామెంట్స్ చేసింది. 

టాలీవుడ్ ఇండస్ట్రీ


ఇది ఇలా ఉండగా సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే ఈక్వేషన్లు చూసి, అడ్వాన్సులు చేతిలో పెట్టిపోయే బయ్యర్ల మధ్య నెలకుని ఉన్న  విపరీతమైన పోటీతో ఈరోజు సినిమా వ్యాపారం ఒక భయంకరమైన వ్యసనంగా మారి వందలాది కోట్ల నల్ల ధనం చేతులు మారే అడ్డాగా మారిపోయింది అని ఆ పత్రిక ఘాటైన కామెంట్స్ చేసింది. అంతేకాదు  ప్రస్తుతం టాలీవుడ్  నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు వారి నల్ల ధనానికి స్వర్గంగా మారింది అంటూ ఆ పత్రిక ప్రచురించిన కధనం టాపిక్ ఆఫ్ ది డేగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: