సినిమా ఇండస్ట్రీకి వస్తే అందులోనూ కాస్త పాపులారిటీ సంపాదించుకుంటే ఇక తిరుగే లేదు అన్నట్లు పవర్తిస్తారు కొందరు నటులు. ఇక సెలబ్రెటీలైతే తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిసూత పోలీసులకు చిక్కుతూ మీడియా కళ్లలో పడుతుంటారు. తాజాగా ఒక సినీనటి పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయ్యింది. కామెడీ, వేంప్, క్యారెక్టర్ అర్టిస్టుగా పరిచయం అయిన కళ్యాని పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కింది. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ చింతల్ కుంటలో పేకాట స్థావరంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది.  


హాస్య నటి కళ్యాని


  సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు నిర్వహించారు. పోలీసుల రాకతో బెంబేలెత్తిన   జూదగాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా, కానీ వారిని చాకచక్యంగా పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నట్లు తెలిసింది.  కారెక్టర్ నటి కళ్యాణితో(కరాటే  కల్యాణి) పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నామని, పేకాట స్థావరంలో రూ. 75 వేల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: