నెపాల్ కేంద్రంగా చేసుకొని నాలుగు దేశాల్లో భూకంపం ఎంత తీవ్ర నష్టాన్ని చవిచూసిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా నెపాల్ రాజధాని ఖాట్మాండ్ లో దాదాపు సమాధులే తలపిస్తున్నాయి.  అంతే కాదు అక్కడ షూటింగ్ జరుపునేందుకు వెళ్లిన వెటకారం చిత్ర యూనిట్ కూడా ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ బయట పడింది కానీ హీరో విజయ్ మాత్రం మృత్యువాత పడ్డాడు. గతంలో  తెలుగులో వచ్చిన కాళీ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కవిత శ్రీనివాసన్ అదృష్టం కొద్ది చావునుంచి బయట పడింది.


కాళీ చరణ్ సినిమాలోని స్టిల్


కాళీ చరణ్ సినిమా తర్వాత కవితకు తెలుగులో మళ్లీ నటించడానికి చాన్సులు రాలేదు దీంతో ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఖాట్మండ్ లో నివాసం ఉంటుంది.


నేపాల్ లో సంబవించిన భూకంపానికి శిథిలమైన ఇళ్లు


 తను ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడిపిందట . అయితే ఎట్టకేలకు ఆ భూకంపం లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా కవిత మాత్రం బ్రతికి బయట పడ్డానని ప్రస్తుతం క్షేమంగా ఉన్నామని చెబుతోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: