అల్లుఅర్జున్ అక్కినేని కుటుంబానికి చాల ఋణపడి పోతున్నాడు. తన కలలను నిజం చేస్తున్న నాగచైతన్య సహాయానికి ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియక సతమతవుతున్నట్లు టాక్. డివైడ్ టాక్ వచ్చి రివ్యులు కూడ సరిగ్గారాని ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విడుదలైన తరువాత తనకు ఎదురైన ఒకొక్క గండాన్ని దాటుకుంటూ ఒక మిరాకిల్ లా డ్రాప్ అనుకున్న ఈ చిత్రం మళ్లీ గడిచిన  వీకెండ్ పుంజుకుని అన్ని చోట్లా స్టడీ అవ్వడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఎన్నో అంచనాలతో ముందు నుంచే పాజిటివ్ టాక్ తో వచ్చిన నాగచైతన్య ‘దోచేయ్’ ఇరు రాష్ట్రాలలోను ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు చూసే వారికి వేరే మార్గం లేక ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నే ఎంచుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ మళ్ళీ పుంజుకుని మొన్న వీకెండ్ ముగిసే సరికి 46.95 కోట్లు వసూలు చేసి సత్యమూర్తి టాప్ 10 రికార్డులలో నిలబడ్డాడు అనే వార్తలు వస్తున్నాయి.

అల్లుఅర్జున్ గత సంవత్సరం సినిమా ‘రేసు గుర్రం’ తో పాటుగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా టాలీవుడ్ టాప్ 10 లిస్టులో చోటు సంపాధించు కోవడం వెనుక బెల్లంకొండ సురేష్ ‘గంగ’(కాంచన 2) రాకపోవటం ఒక కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి. చైతన్య, బెల్లంకొండల దురదృష్టం బన్నీకి అదృష్టంగా మారడం కాలం కలిసి వచ్చింది అనుకోవాలి.

ఈ వార్తలు ఇలా ఉండగా అల్లుఅర్జున్ బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్న లేటెస్ట్ సినిమాకు ‘రధం’  అన్న టైటిల్ రిజిస్టర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే యాక్షన్ హీరోగా పేరు గాంచిన బన్నీ సినిమాకు ‘రధం’ టైటిల్ ఏమిటి అంటూ అప్పుడే  ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి. అదృష్టం నీడలా బన్నీ వెంట తిరుగుతున్న నేపధ్యంలో ఈ ‘రధం’ కూడా కలక్షన్స్ రధయాత్ర చేసినా ఆశ్చర్యం లేదు..




మరింత సమాచారం తెలుసుకోండి: