దగ్గుబాటి వారసుడుగా వెంకటేశ్ తర్వాత స్థానంలో వచ్చాడు ఆరు అడుగుల ఆజాను భాహుడు రానా (రామానాయుడు)... తాత పేరును షార్ట్ కట్ లో పెట్టుకొని మనోడో అటు బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రానా తీసినవి కొన్ని సినిమాలే అయిని అందులో లీడర్,కృష్ణం వందే జగద్గురుం సినిమాలు మంచి పేరు తెచ్చాయి. అంతే కాదు బాహుబలి, రుద్రమదేవి లాంటి అద్భుతమైన హిస్టారికల్ సినిమాల్లో నటించాడు.


దగ్గుబాటి రానా స్టిల్


మరి టాలీవుడ్ లో మోస్ట్ హ్యండ్సమ్ బ్యాచ్ లర్స్ ఇద్దరే ఇద్దరు ఒకరు ప్రభాస్ మరొకరు రానా. ఇద్దరు బాహుబలి ప్రాజెక్టు అయ్యాక పెళ్లి చేసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈలోగా ఒక అడుగు ముందుకు వేశాడు రానా. అవును రానా ఇప్పడు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఒక ఇంటివాడు అయ్యాడు.


ఆ....ఆశ్చర్య పోకండి ఇది నిజం పెళ్లి కాదండి బాబు ఉత్తుత్తి పెళ్లి అంటే రానా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఈ స్టిల్ రానా తమిళం లో నటిస్తున్న బెంగుళూర్ డేస్ సినిమాలోనిది. మొదటి సారి పెళ్ళికొడుకు గెటప్ వేశానని రానా తన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఆ స్టిల్లె ఇది ? బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: