భారత క్రికెట్ ప్రియులకు ఆరాధ్య దైవం.. లివింగ్ లెజెండ్ అయిన సచిన్ టెండుల్కర్ ఇప్పుడు మహా కోపంగా ఉన్నాడు. మరి ఇంత కోపం దేనికబ్బా అని ఆరా తీస్తే.. ఈ మధ్య సచిన్ ముద్దుల కూతురు సారా టెండుల్కర్ బాలీవుడ్ ఎంటర్ అవుతుందని షాహిద్ కపూర్ తో జత కట్టబోతుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.


సచిన్ టెండుల్కర, అంజలి,సారా, అర్జున్ 


ఇంకేముంది సచిన్ ఇంటికి ఫోన్ల మోతలు మొదలయ్యాయట. వాటికి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాడు సచిన్. అసలు తన కూతురు ఏంటీ సినిమాల్లోకి రావడం ఏంటీ అని ఆ వార్తలన్నింటిని ఖండిస్తున్నాను అని అన్నాడు. అవన్నీ నిరాధారమైన వార్తలు అని వాటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు తన కూతురు చక్కగా చదువుకుంటుందని ఇప్పడప్పుడే ఏ ఆలోచనలు లేవని తెలిపారు.


సారా టెండుల్కర్


మరింత సమాచారం తెలుసుకోండి: