తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సంవత్సరం పద్మ అవార్డు వస్తుందని అందరూ ఆశించారు. కానీ అనుకోని విధంగా ఈయన పేరు తొలగించారు. అంతే కాకుండా యోగ గురు రాందేవ్ బాబా, బాలీవుడ్ హీరో బీజేపీ నాయకుడు శతృఘ్నసిన్హా  పేర్లు కూడా తొలగించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి పద్మ అవార్డు ల కోసం 1,793 మంది పేర్లు సూచించబడ్డాయి వీరిలో ఈ ముగ్గరు పేర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మరికొంత ప్రముఖుల పేర్లు కూడా తొలగించినట్లు సమాచారం. వారిలో ధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయి, భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ బ్లాక్‌విల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్, పారిశ్రామికవేత్త బ్రిజ్ మోహన్‌లాల్ ముంజల్ తదితరుల పేర్లు ఉన్నాయి. 


రాందేవ్ బాబా, రజినీకాంత్


 ఇప్పటికే రజినీకాంత్ కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ యేడాది కి గాను అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషన్’ అవార్డు వస్తుందని అందరూ ఆశించారు. అయితే ఈ సంవత్సరం మటుకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్‌లను పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.  ఈ ఏడాది పద్మ అవార్డులకు సిఫారసు చేయబడిన ఇతర ప్రముఖుల్లో మళయాళ సినీ స్టార్ మోహన్‌లాల్, జమ్మూ-కాశ్మీరు బిజెపి నేత దరాక్షన్ అంద్రాబీ, అథ్లెట్ అంజూ బాబీ జార్జ్, బ్యుటీషియన్ షహనాజ్ హుసేన్, సినీ నిర్మాత రోహిత్ శెట్టి, అపోలో హాస్పిటల్స్ ఎండి ప్రీతా రెడ్డి, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు.  మరో ట్విస్టు ఏంటంటే ఏడాది పద్మ అవార్డులకు పేర్లను ఖరారు చేయడానికి ముందే తాను ఈ అవార్డును స్వీకరించబోనని రామ్‌దేవ్ బాబా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: