టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు  రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నా అనుకోకుండా ఎన్ఆర్ఐ తెలుగు సంస్థల రాజకీయాల మధ్య ఇరుక్కు పోవడం మహేష్ కు తల నొప్పిగా మారింది అనే వార్తలు వినపడుతున్నాయి. అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ ‘తానా’ మహా సభలకు జూన్ లో ముఖ్య అతిధిగా వెళ్ళ బోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‘తానా’ మహాసభలకు మహేష్ ముఖ్య అతిధిగా హాజరు కావడం వెనుక కోటిన్నర రూపాయల వ్యవహారం నడిచిందని వెబ్ మీడియాలో తీవ్రంగా వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలు మహేష్ దృష్టికి వెళ్ళడంతో


అయితే ఈ వార్తలు మహేష్ దృష్టికి వెళ్ళడంతో సున్నిత మనస్కుడు అయిన మహేష్ మధన పడుతున్నట్లుతెలుస్తోంది. ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఉపయోగిద్దాము అని అనుకున్న ఈ కోటిన్నర వ్యవహారం అర్ధం మారి ముఖ్య అతిధిగా తాను ‘తానా’ సభలకు వచ్చినందుకు ‘తానా’ సంస్థ నుండి ముక్కుపిండి తన వ్యక్తిగత ప్రయోజనానికి ఈ మొత్తాన్ని తన క్రేజ్ ను అడ్డు పెట్టి ‘తానా’ నుండి పొందుతున్నట్లుగా  అర్ధం వచ్చే విధంగా వచ్చిన గాసిప్పులతో చికాకు పడ్డ మహేష్ తాను ‘తానా’ మహాసభలకు రాలేను అని ఆ సంస్థ నిర్వాహకులకు మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. 

‘తానా’ సంస్థకు పోటీగా 


ఈ అనుకోని షాక్ కు ఉలిక్కి పడ్డ తానా సంస్థ నిర్వాహకులు తాము ఈ విషయాన్ని లీక్ చేయలేదని ‘తానా’ సంస్థకు పోటీగా అమెరికాలో కార్యక్రమాలు నిర్వహించే ఇతర తెలుగు సంస్థలు మహేష్ కోటిన్నర విషయాన్ని మీడియాకు లీక్ చేసి ఇంత రచ్చ చేశాయని మహేష్ కు తమ వాదన వినిపిస్తున్నట్లు టాక్. 


మహేష్ విషయాన్ని మీడియాకు హాట్ టాపిక్ గా


అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ సంస్థల రాజకీయాల నేపధ్యంలో మహేష్ విషయాన్ని మీడియాకు హాట్ టాపిక్ గా చేసి లీక్ లు ఇస్తూ ఉండటంతో ఈ అనుకోని ఎన్ఆర్ఐ రాజకీయాల మధ్య తానెందుకు చిక్కుకున్నాను అంటూ మహేష్ టెన్షన్ పడుతున్నాడని టాక్. కానీ అమెరికాలోని తెలుగు వారిలో మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా మహేష్ ఈ అవకాశాన్ని వదులుకోడు అనే వాదన కూడ ఉంది..     



మరింత సమాచారం తెలుసుకోండి: