తెలుగు ఇండస్ట్రీలో వారి కాంబినేషన్ సూపర్ హిట్.. ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే తెలుగు ప్రేక్షకులకు పండగ వాతావరణమే..మరి ఆ ఇద్దరు ఎవరా అనుకుంటున్నారా..ఎవరో కాదండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’ ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా షేక్ చేశాయో వేరే చెప్పనవసరం లేదు. మరి వీరి కాంబినేషన్ లో మరో మూవి రాంబోతుంది ‘కోబలి’ అయితే ఈ ప్రాజెక్టు పవన్ కళ్యాన్ మదిలోంచిపుట్టిందట.


కోబలి ఫ్యాన్స్ పోస్టర్


అత్తారింటికి దారేది సినిమా తర్వాత మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నప్పటికీ కొన్ని అవాంతరాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పటికే త్రివిక్రమ్‌  సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడని, పవన్‌కి కూడా వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరా తర్జన భర్జన చేసిన తర్వాత తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అనుష్క అయితే బాగుంటుందని అనుకున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్, అనుష్క కాంబినేష్ ‘ఖలేజా’ లో నటించింది. అంతే కాదు పవన్ కళ్యాన్ సరసన అనుష్క అంటే సూపర్ కాంబినేషన్ అన్నట్లే మెగా అభిమానులకు పండగే కదా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: