టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సన్నాఫ్ సత్యమూర్తి, బాక్సాపీస్ లెక్కలను చెరిపేస్తుందనే టాక్స్ రిలీజ్ కి ముందు హోరెత్తించాయి. కాని రిలీజ్ అనంతరం స్టార్ కాస్టింగ్ మూవీ కాబట్టి ఎలాగొలా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తో ముందుకు వెళుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సన్నాఫ్ సత్యమూర్తితో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన అప్ కమింగ్ ఫిల్మ్  కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాడు..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ లోగా ఆయన తన సమ్మర్ వెకేషన్ ని పూర్తి చేసుకుని వచ్చేయాలనుకుని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సమ్మర్ ని లండన్ లో గడపనున్నారని తెలుస్తోంది. అక్కడ నుంచి రాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 

అయితే ఈ సమ్మర్ ట్రిప్ లో త్రివిక్రమ్ సైతం జాయిన్ అయ్యే అవకాశం ఉందని గతంలో టాక్స్ వినిపించాయి. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్ తో  కలిసి సమ్మర్ ట్రిప్ ని ఎంజాయ్ చేయటానికి అల్లుఅర్జున్ నో అనేశాడంట. ఈ కారణంగా లండన్ ట్రిప్ కి త్రివిక్రమ్, అల్లు అర్జున్ నుండి దూరమైనట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇక బోయపాటి చిత్రం విశేషాలకి వస్తే... అల్లు అర్జున్, సింహా దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి టైటిల్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది మరేదో కాదు... ‘రథం'. అయితే ఈ టైటిల్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: