ఏ మాయ చేశావే'తో తొలిసారి తెలుగువారి ముందు నిలచిన సమంత ఆ సినిమా విజయంతోనే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది...ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది సమంత. ఆ సినిమా విక్టరీతో ఈ కుందనపు బొమ్మ రన్నింగ్ కి బ్రేకులు లేకుండా పోయాయి.ఒకదాని వెంట ఒకటి వరుసగా అవకాశాలు అమ్మడి ఒళ్లో వచ్చిపడ్డాయి. టాప్ హీరోలు అమ్మడి కాల్షిట్ల కోసం క్యూ కట్టారు.  లాగే, ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ, 'గుడ్ హ్యూమన్ బీయింగ్' అనిపించుకుంది. ఈ సంగతలా ఉంచితే, సమంత పుట్టినరోజు విషయానికొస్తే... అభిమానులు ఆమెకు స్వీట్ షాకివ్వాలనుకున్నారు. ఓ 73 వేల మంది అభిమానులు ట్విట్టర్లో సమంత ఫొటోని 'డిస్ ప్లే పిక్చర్'గా పెట్టారు. ఈ విషయాన్ని సమంతకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. @SamanthaPrabuFC ట్విట్టర్ లోకి వెళితే.. సమంత డిస్ ప్లే పిక్చర్ ని చూడొచ్చు. ఇక్కడ ఈ న్యూస్ లో కనిపిస్తున్న ఫొటోనే సమంత అభిమానులు డిస్ ప్లే చేశారు. 73 వేల మంది అభిమానులు ఈ ఒకే ఫొటోని పెట్టుకున్నారు.

ఫలితంగా బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, అల్లుడు శీను, మనం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బ్లాస్టర్లు అమ్మడి ఖాతాలో పడ్డాయి..మొదటి నుంచి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కుర్రకారు మదిని దోస్తోంది.యంగ్ హీరోల్లో దాదాపుగా అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.. మహేష్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య, నాని.. ఇలా యంగ్‌ హీరోలందరి సరసన నటించి పర్ ఫెక్ట్ జోడిగా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం కోలీవుడ్ పైనే దృష్టి సారిస్తోన్న సమంత, అక్కడ కూడా తెలుగులో లాగే విజయాలను సాధిస్తుందేమో చూద్దాం.


ఫ్యాన్స్ తో పుట్టిన రోజు జరుపుకుంటున్నా సమంత



మరింత సమాచారం తెలుసుకోండి: